ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

లోతట్టు ప్రాంత ప్రజల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టండి

అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నాడు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వడగండ్ల వర్షం వల్ల తలెత్తిన పరిస్థితులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షించారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ తో పాటు ఇతర అధికారులతో వడగండ్ల వాన కురిసిన ప్రాంతాలపై అరా తీసారు.అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులైన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. రానున్న కొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం ఉన్నందున మునిసిపాలిటీ లు, కార్పొరేషన్ లలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు  తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: