ఆపదలో ఉన్న అన్నదాతకు ఆపద్బంధువుడయ్యారు

రైతన్నకు లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న బిజెపి నేత బుక్క వేణుగోపాల్

ప్రజా సమస్యలు గాలికి వదిలేసి బిడ్డను కాపాడుకుని పనిలో కేసీఆర్.. బుక్క వేణుగోపాల్ విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న నిమ్మల శేఖర్ రైతుకు ఒక లక్ష రూపాయిలను అందజేసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆదుకున్నారు. ఇటీవల విధి కుక్కల దాడిలో రాజేంద్రనగర్ నియోజకవర్గ నర్కూడ గ్రామా రైతు తన పశువులను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్  ఆ రైతును పరామర్శించి ఆ రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా  బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ వారు రాష్ట్రంలోని ప్రతి మూలలో ప్రతి రోజు విధి కుక్కలా స్వైర విహారంలో తెలంగాణ బిడ్డల ప్రాణాలు కోల్పోతుంటే కెసిఆర్ కేవలం తన బిడ్డను కాపాడుకునే పనిలోనే పడ్డారని ఆయన విమర్శించారు.  రైతు తన పశువులను సొంత బిడ్డలగా పెంచుకుంటాడని, అలంటి రైతు పశువులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధి కుక్కల సమస్యలపై దృష్టి సారించి.. వాటిని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: