గ్యాస్ ధర పెంపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో,,,
కదం తొక్కిన గులాబి సైన్యం
మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో మోడీ డౌన్ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు
కట్టెల మోపును తలపై మోస్తూ ర్యాలీలో వచ్చిన మంత్రి సబితా రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్రం తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళా లోకం కదం తొక్కింది. మీర్ పేట్ కార్పోరేషన్ పరిధిలో మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మహిళలు హోరెత్తించారు. కట్టలమోపును తలపై మోస్తూ ర్యాలీలో మహిళలతో కలసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కదంతొక్కారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....బీజేపీ నేతలు ఒక్క సారి అధికారం ఇవ్వమని ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని అడుగుతున్నారు..పొరపాటున కమలం గుర్తుకు ఓటు వేస్తే కట్టెల పోయి వస్తది...పేద ప్రజల జేబులు ఖాళీ అవుతాయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరల పెరుగుదల, ధరలు పెంచుకుంటూపోతూ పేదల నడ్డివిరుస్తున్న మోడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుర్తు పెట్టుకొని గద్దె దించాలన్నారు. జేబులకు చిల్లు పెట్టిందిక చాలు మోడీ...సాలు మోడీ సంపకు మోడీ అంటూ నినదించారు. రేషన్ షాపుల వద్ద కాదు మోడీ ఫోటో ఉండాల్సింది....గ్యాస్ సీలిండర్ల పైన పెట్టాలన్నారు. కమలం కు ఓటు వేస్తే ఇంటికి కట్టెల పోయి వస్తుంది.రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని గద్దె దించాలి.
నిరుపేద కుటుంబాలకు గుదిబండగా మారిన గ్యాస్ బండ...కార్పొరేట్లకు మినహాయింపులు,పేదలపై భారాలా? పెరిగిన ధరలతో గ్యాస్ బండ కన్నా కట్టెలపోయే మేలు అని మహిళలు భావిస్తున్నారన్నారు. మోడీ వసై అచ్చెదిన్ వస్తాయి అన్నారు కానీ సచ్చే దిన్ వచ్చిందని వ్యాఖ్యానించారు. నల్లధనం తెచ్చి అందరి అకౌంట్ లో వేస్తానన్న 15 లక్షల కాదు కదా 15 పైసలు కూడా రాలేవు. కార్నర్ మీటింగ్ లలో గ్యాస్ ధరలపై నిలదీయండి.ఇప్పటికే విపరీతంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ధరలు పెంచి కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నందుకు మోడీ బీజేపీ వాళ్లకు దేవుడయ్యారా? అని ఆమె ప్రశ్నించారు.
ధర్నాకు ప్రజల నుంచి విశేష స్పందన
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన ధర్నాకు విశేష స్పందన లభించింది.జిల్లెలగూడ చందనం చెరువు నుండి మీర్పేట చౌరస్తా వరకు కొనసాగిన నిరసన ప్రదర్శనలో మహిళలు స్వచ్చందంగా పాల్గొని మద్దతు తెలిపారు.పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేసారు.
తలపైన కట్టెల మోపును ధరించి నిరసనలో పాల్గొన్న మంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మండి పడ్డారు.ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో మహిళల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపట్టని మోడీ మహిళ దినోత్సవ కానుకగా గ్యాస్ ధరను పెంచారని ఎద్దేవా చేసారు. బీజేపీ పాలిత రాష్టాల్లో అన్ని రకాల పెన్షన్లు 700 లోపే ఇస్తున్నారని,బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణలో కూడా అదే విధంగా ఇస్తారన్నారు.ధరలు తగ్గించే వరకు మహిళలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ గారు, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి గారు,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి గార్లు,నియోజకవర్గ పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు, మహిళ,యువజన నేతలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: