ప్రజల మన్నలను పొందుతున్న వెంకటేష్ కృషి అభినందనీయం

వెంకటేష్ ను సన్మానించిన బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహనరావు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 కులవృత్తి తో పాటు రాజకీయ,  ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజల  మన్నలను పొందుతున్న వెంకటేష్ కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహనరావు అన్నారు.దరుషిఫా మేరు భవనంలో జరిగిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలలో ముఖ్యఅతిధిగా హాజరైన వకుళాభరణం కృష్ణ మోహనరావు సమాజంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకుడు కిష్టా రెడ్డి పేట వెంకటేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా కృష్ణ మోహనరావు మాట్లాడుతూ వెంకటేష్ తండ్రి స్వర్గీయ ప్రకాష్ అన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోని తండ్రికి తగ్గ తనయునిగా తనదైన శైలిలో సమాజంలో  సేవలు చేస్తూ అందరి ఆదరాభిమాలను వెంకటేష్ అందుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేరు సంఘము పెద్దలు కొవ్వూరు భాస్కర్  రావు,పొడిశెట్టి నర్సింగరావు,సంఘేవర్,దీకొండ నర్సింగరావు,కీర్తీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: