బాసావ్ గుట్టను దర్శించుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పహాడీ షరీఫ్  దర్గాలో ప్రత్యేక* *ప్రార్థనలు* 

*బాబా షర్ఫుద్దీన్ కు పూలు, చాద్దర్ సమర్పించుకున్న మంత్రి

బాబా షర్బద్దీన్ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల పర్యవేక్షణ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 375 సంవత్సరాల చరిత్ర గల పహాడీ షరీఫ్  బాబా షర్ఫద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అక్కడి అభివృద్ధి  పనుల్ని పర్యవేక్షించారు. దేశంలోని నలుమూలల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. వీటిని దృష్టిలో ఉంచుకొని దర్గాలో అన్ని వసతుల ఏర్పాటు చేయడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాబా షర్ఫుద్దీన్  దర్గాకు చేరుకునేందుకు 365 మెట్లు ఎక్కి బాబా షర్ఫుద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పూలు  చద్దర్ సమర్పించారు


. ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కమిషనర్, ఇతర అధికారులు పహడి షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: