మార్చి 2023

 భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు


 
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శుక్రవారంనాడు జలమండలి, గాంధీ జ్ఞానం ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమములో పాల్గొని  మంత్రి. పి. సబితా ఇంద్రారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.  కేసీఆర్ గారు రాష్ట్రమంతా నీటి కొరకు ప్రాజెక్టులు నిర్మించడం, నదులను, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పూడికలు తీయించడం వల్ల గతంలో కంటే భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని రానున్న వర్షాకాలంలో వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా జల నిధిగా మార్చుకొని భూగర్భజలాల నిల్వలు  పెంపొందే విధంగా కృషి చేయాలి అన్నారు.


త్రాగునీటికి, సాగునీటికి... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో వందల కిలో మీటర్ల దూరం నుండి నగరానికి ఉచితంగా నీరు అందిస్తుందని  అట్టి నీటిని వృధా చేయకూడదని కోరారు.   ప్రతి విద్యా సంస్థలో ఇంకుడుగుంతల నిర్మాణాలకు,ప్రతి విద్యార్థి భాగస్వామిని చేసే విదంగా వారికి ప్రాజెక్టు కృత్యంగా చేయనున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా జలమండలి అధికారులతో కలసి స్వచ్ఛంద సంస్థ  ...ప్రజలకు,విద్యార్థులకు అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్న గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్  డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి మరియు వారి ప్రతినిధులు యానాల ప్రభాకర్ రెడ్డి, పొట్లపల్లి గిరిధర్ గౌడ్ గార్లను అభినందించారు.  ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్లు వి. నరేష్, ఎన్. ప్రుద్వి, కె. శ్రీకాంత్,డి. శివ కిషోర్ రెడ్డి, ఎస్.శివ , వి. విజయ్ గౌడ్ మరియు మధు పాల్గొన్నారు.




 

 ప్రశ్నించే గొంతును అణచడంకోసమే రాహుల్ గాంధీపై అనర్హతవేటు

హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సమీర్ వల్లివుల్లా

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టినందుకే ప్రయత్నించినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై వేటు  వేశారని హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సమీర్ వల్లివుల్లా ఆరోపించారు. ఏఐసీసీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో విలేకరుల సమావేశం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సమీర్ వలీవుల్లా పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి చారిత్రక చార్మినార్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇడి, సిబిఐ, యుఎపిఎ వంటి ప్రభుత్వ సంస్థలతో అసమ్మతిని అణిిచేసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు.  ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై కేసులతో బెదిరింపు లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నారని


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఆదాని విషయంలో రూ.కోట్ల నిధుల సంబంధించి రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు పైకి  కనిపించే దానికంటే అంతర్గతంగా చాలాబలంగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఇంచార్జి న్యాయవాది ముజీబ్ ఉల్లా షరీఫ్, బహదూర్‌పురా అభ్యర్థి కలీమ్ బాబా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సి శ్రీనివాస్, హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తహసీన్ ఫాతిమా, మీర్జా అస్కారీ బేగ్, షాబాజ్ ఖాన్, అలీ, చందు, అహ్మద్, అస్లాం షరీఫ్, అసద్, అమీర్, కెఎస్ ఆనందరావు పాల్గొన్నారు. , కౌసర్ ఫాతిమా మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 


 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో... 

నిరుపేద బ్రతుకులలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడు  మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సరూర్నగర్, ఆర్కే పురం డివిజన్లకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ


అహర్నిశలు నిరుపేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా అమలు పరుస్తున్నామని గతాన్ని మర్చిపోవద్దు కష్టకాలంలో ఉన్నా సరే సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్, సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, ఆర్కే పురం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ, నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




 శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న...

దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్... వివిధ పార్టీల ప్రముఖులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని పాతబస్తీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్ పాల్గొన్నారు. గురువారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని దూద్ బోలి, పురానాపూల్, ఖబూతర్ కానా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉమా మహేంద్రా. దోరేటి ఆనంద్ గుప్తా పుస్తెశ్రీకాంత్ .సున్నం రాజమోహన్ అభిషేక్ రాజ్ సెక్స్ సేన తదితరులు పాల్గొన్నారు. 




 ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

పాతబస్తీలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు

హాజరైన ప్రముఖులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దూద్ బోలిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ భవనంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సంఘం అధ్యక్షులు గోరేటి ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకల్లో సిద్ధాంతి లక్ష్మణమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ చానల్ సీనియర్ రిపోర్టర్ కృష్ణమూర్తి


ఈ కార్యక్రమంలో పురాణా పూలు కార్పొరేటర్ సున్నం రాజమోహన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఏసిపి రుద్ర భాస్కర్, మాజీ ఏసిపి అశోక చక్రవర్తి, టిఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ పుస్తె శ్రీకాంత్, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, మజ్లీస్ పార్టీ నాయకులు రాజు, యువజన విభాగం నాయకుడు దీపేష్ కుమార్ లతోపాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మహిళా మండలి సభ్యులు వాసవి భవనం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .







 వయోవృద్ధులకు పెద్ద కొడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 

శ్రీరామ్ నగర్ కాలనీ ఆత్మీయ సమ్మేళన సభ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

రాష్ట్రంలోని వయోవృద్ధులకు పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వయోవృద్ధులకు  రూ. 2వేల పెన్షన్ ఇస్తూ పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ , చెరువుల సుందరీకరణ అక్కడితో ఆగకుండా కంటి వెలుగు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసి అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.


ఒకప్పుడు జలపల్లి కి రావాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం పక్కా డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అన్ని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పనులు జరగాల్సి ఉందని, వాటిని కూడా దశల వారీగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదలైన వారు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వారు రెగ్యులరైజేషన్  చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుండి ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అమలులోకి రానుందని, ప్రభుత్వ  స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారు 2020 లోపు ఉన్నవారు అర్జీ పెట్టుకోవాల్సిందిగా మంత్రి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని బలపరిచి అభివృద్ధికి బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, జలపల్లి మున్సిపాలిటీ  అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, సూరెడ్డి కృష్ణారెడ్డి,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





 


 బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్,,,

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్ నియామకం

కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా *యాతం పవన్ కుమార్ యాదవ్ ఎంపిక

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందజేసిన రామిడి రాంరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా యాతం పవన్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ కార్పోరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్, కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా యాతం పవన్ కుమార్ యాదవ్ ను నియమించారు. బుధవారం నాడు బడంగ్ పేట్ కార్పోరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని కలసి వీరి నియమకపత్రాలను అందజేశారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్,యతం పవన్ కుమార్ యాదవ్, పెద్ద బావి శోబా ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,  రామిడి కవిత రాంరెడ్డి, బీమిడి స్వప్న జంగా రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, జేనిగే భారతమ్మ కొమురయ్య యాదవ్, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, లిక్కి మమత కృష్ణ రెడ్డి, బోద్రమోని రోహిణి రమేష్, సుక్క శివ కుమార్, కో ఆప్షన్ సభ్యులు గుండోజు రఘునందన్ చారి, గుర్రం ప్రస్సన్న వెంకట్ రెడ్డి, మర్రి జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎల్ వి జ్యోతి అశోక్, షేక్ ఖలీల్ పాషా, నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 ఆ స్థలాల రెగ్యులరైజ్ కు అవకాశం

వాటిని సద్వినియోగం చేసుకోండి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెగులరైజ్ చేసుకోవటానికి మరొక అవకాశం కల్పించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వచ్చే నెల ఏప్రిల్ 1 వ తేదీ నుండి 58,59 జి ఓ లకు సంభందించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు. సోమవారం నాడు మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి రెవెన్యూ అధికారులతో 58,59 జి ఓ లకు సంభందించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో 2014 వరకు కట్ ఆఫ్ గా ఉండగా తాజాగా 2020 జూన్ 2 వరకు కట్టుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


నోటరీ,ఇతరత్రా ప్లాట్ ల పైన కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గములో 58 జి ఓ ద్వారా 966 మంది లబ్ధిదారులకు హక్కులు కల్పించినట్లు త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు.ఏప్రిల్ 1 నుండి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, తహశీల్దార్ లు జనార్దన్ రావు,  మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.




 మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై ఒక అవగాహన వస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్ఫారం సంస్థ ఐన ఎక్స్ ప్లోర్.కో. ఇన్ (Xplore.co.in ).. గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, ఆధ్వర్యములో నిర్వహించబడు మాక్ ఎంసెట్ టెస్ట్ సిరీస్ కు సంబందించిన పోస్టర్  ను సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు


.విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ ఈ సిరీస్ లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్ కు హాజరు కానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి ప్రాక్టీస్ కొరకు వినియోగించుకొనవచ్చు నని తెలిపారు. పరీక్ష వ్రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలియబడుతాయని,


తద్వారా మెయిన్ పరీక్షలకు  విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చునని తెలిపారు. సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ గారు మాట్లాడుతూ  ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి ప్రమాణాలతో కూర్చబడినవి అని తెలిపారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tseamcet.xplore.co.in/ నందు నమోదు చేసుకొనవలసినదిగా కోరారు. మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5వ తేదీన ఉదయం 9 గం నుండి సాయంత్రం 5 గం వరకు https://tseamcet.xplore.co.in/ లో అందుబాటులో ఉంటుంది. తదుపరి మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25 మరియు 30 తేదీలలో నిర్వహించబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో Xplore company మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి కూడా పాల్గొన్నారు.

 విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్

అలాంటి నాయకుడి నాయకత్వాన్ని బలపర్చాలి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అనిత రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం  ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ రైతు మార్కెట్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ రమణ, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని మన రాష్ట్రం మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కొనియాడారు.


ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ  మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కంకణం కట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి పట్టుదల కృషి అమోఘమని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని సబితా ఇంద్రా రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పాలిట పెన్నిధిగా ఉందని రోజు ఈ ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమం ద్వారా నాయకులు కార్యకర్తలు కలిసి అభివృద్ధి పై చర్చ జరిపి మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని ఎల్ రమణ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు  కామేష్ రెడ్డి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పలువురు దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, వేముల నరసింహ, ఇంద్రవత్ రవి నాయక్, విజయ్ సౌందర్య, రాజు విజయలక్ష్మి,, నందు, లెనిన్ నగర్ పవన్, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.