విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం...
గడివేములలోని ఎరుకలి కాలనీ
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎరుకలిపేటలో విద్యుత్ వైర్లు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షంగా నిలుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గడివేముల నుండి బిలకలగూడూరు వెళ్ళు రహదారిలో ఉన్న ఎరుకలిపేటలో స్తంభానికి, స్తంభానికి మధ్యలో ఉండే విద్యుత్ తీగలు పిల్లలకు సైతం అందుకునెందుకు వీలుగా క్రిందికి వేలాడి ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కాలనీ వైపు గాని, వేలాడుతున్న విద్యుత్ తీగల వైపు కానీ విద్యుత్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని,
విద్యుత్ తీగలు రహదారి పక్కన ఉన్న చెట్లపై పడి ఉన్నాయని,చెట్లకు విద్యుత్ సప్లై ఎప్పుడు వస్తుందో,ఎవరికి ప్రాణహాని జరుగుతుందో ఆనీ కాలనీవాసులు భయంతో కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కాలనీలోనీ విద్యుత్ తీగలకు మరమ్మతులు చేసి ఎవరికీ ప్రాణహాని కలగకుండా చూడాలని ఎరుకలిపేట కాలనీవాసులు కోరుకుంటున్నారు.
Home
Unlabelled
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం... గడివేములలోని ఎరుకలి కాలనీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: