వేరు వేరు సంఘటనలో రెండు కేసులు నమోదు

గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వేరు వేరు సంఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై బిటి వెంకట సుబ్బయ్య తెలిపారు.వివరాలలోకి వెళ్తే గడివేముల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి (54) ఆర్మీ నందు పనిచేసి రిటైడ్ అయిన సమయంలో ప్రభుత్వం వారు గని గ్రామ పొలిమేరలో 4.92 ఎకరాల భూమిని ఇవ్వగా వెంకట రమణారెడ్డి సాగు చేసుకుంటూ పొలంలో జోన్న పంట వేయగా గని గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు మరియు మంచాలకట్ట గ్రామానికి చెందిన పింజరి హమీద్ లు ట్రాక్టర్ నెంబర్ 5663 తో వెంకటరమణారెడ్డి పొలంలో అక్రమంగా ప్రవేశించి జొన్న పంటను నాశనం చేసి 30,000 రూపాయలు నష్టపరిచారని వెంకటరమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అదేవిధంగా గడిగరేవుల గ్రామానికి చెందిన వాసబోయిన ఆదిలక్ష్మి ఆడపడుచు కూతురు తులసి బేతంచెర్ల గ్రామానికి చెందిన మధుప్రేమ్ అను వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని,ఇతరులతో చెప్పుకుంటూ పరువు తీస్తున్నారని 03-02-23 వ తేదీన మధుప్రేమ్ తన చరవాణి నుండి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ, చంపుతానని బెదిరించాడని ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: