మహానంది క్షేత్రంలో భక్తులకు అందని మంచినీరు...
నేరుగా బోరునీళ్లు తాగాల్సిన దుస్థితి
మరమ్మత్తులు నోచుకోకుండా.... పక్కన పడ్డ నీటి శుద్ధి యంత్రం
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం జల సంపదలకు నిలయం అని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనం నిరంతరం స్వయంబుగా వెలసిన పరమశివుని చెంతనుండి అద్భుతమైన జలం ప్రవహిస్తూ అందరిని ఆశ్చర్య పరిచే విషయం. ఇతర రాష్ట్రా,ప్రాంతాల నుండి మహనందికి వచ్చే భక్తులు ఇలాంటి జలాన్ని ఎక్కడ చూడలేదని చెబుతుంటారు. కానీ మహానంది క్షేత్రంలో మాత్రం భక్తులకు దాహం తీర్చుకునేందుకు త్రాగడానికి మంచినీళ్ళు దొరకక అల్లాడిపోతున్నారు.
మహానంది క్షేత్రంలో దర్శనానంతరం ప్రసాదాలు స్వీకరించాక తప్పని పరిస్థితుల్లో కొళాయి నీళ్లతో దాహం తీర్చుకుని వెళ్తున్నారు. గతంలో భక్తులకోసం ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు శుద్ధ త్రాగునీటి జలాలను అందించేలా చర్యలు చేపట్టారు. దేవస్థానం లోని ప్రసాదాల విక్రయశాలవద్ద లక్షల రూపాయల వ్యయంతో శుద్ధ నీటి జలాన్ని తయారు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా శుద్ధ నీటిని తయారు చేసే యంత్రం ఆరునెలల క్రితం మరమ్మత్తుల పాలైంది. దాతలు ఇచ్చిన సొమ్మేకదా అనుకున్నారో ఏమో గాని మరమ్మతులు చేయడం మరచిపోవడంతో శుద్ధ జలాలు భక్తులకు అందకుండా పోయింది. యంత్రానికి మరమ్మత్తులు చేయకుండా నేరుగా వాటర్ ట్యాంక్ నుండి నీటిని భక్తులకు అందించి చేతులు దులుపుకుంటున్నారు. చిన్న చిన్న దేవాలయాల వద్ద భక్తులకు మంచినీటి సౌకర్యం అందిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరు ప్రఖ్యాతలు కలిగిన మహానంది దేవస్థానంలో మాత్రం భక్తులకు దాహం తీర్చుకునేందుకు మంచినీళ్ళు దేవాలయ సిబ్బంది అందించకపోవడం ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మహానంది క్షేత్రానికి దర్శనార్థం వేలాది మంది భక్తులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారులు దృష్టిసారించి దాతల సొమ్ము వృదాకాకుండా మంచినీటి సౌకర్యం కల్పించి భక్తుల దాహం తీర్చే విధంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Post A Comment:
0 comments: