అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం

పురానాపూల్, ఝాన్సీ బజార్ లో అక్రమ కట్టడాల కూల్చివేత

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మహానగర పాలక సంస్థ చార్మినార్ జోన్ సర్కిల్ 09 పరిధిలో అక్రమ కట్టడాలపై జిహెచ్ఎంసి అధికారులు కొరడా జలుపించారు. సర్కిల్ 09 పరిధిలోని పురాణాపూల్ ఝాన్సీ బజార్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను గురువారం నాడు జిహెచ్ఎంసి అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా కడుతున్న నిర్మాణాలను కూల్చివేశారు. పురాణపు డివిజన్ పరిధిలో ఓ భవన నిర్మాణదారుడు స్థానికులకు ఇబ్బంది కలిగేలా తన భవనాన్ని నిర్మిస్తుండగా సర్కిల్ 09 ఏసిపి రాణి తన సిబ్బందితో వెళ్లి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చి వేయించారు.


అదే సందర్భంలో ఘాన్సీ బజార్ డివిజన్ పరిధిలోని మట్టికా షేర్, లాడ్ బజార్ పరిధిలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఏడు నిర్మాణాలను సీజ్ చేసి, వాటిలో కొన్నింటిని కూల్చి వేయించారు. దీంతో అక్కడ స్వల్ప ఉధృత చోటు చూసుకుంది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ టీమ్ ఇంచార్జ్, సంతోష్ నగర్ డిసి అలివేలు మంగతాయారు, టౌన్ ప్లానింగ్ ఏసిపి రాణి, శ్రీహరి, రాందాస్, ఫాహిమ్ సిబ్బంది శివ, అజీమ్, అబ్బాస్ అలీ, స్థానిక పోలీసుల సహాయంతో ఏడు భవనాలను సీజ్ చేశారు. వాటిలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలు విరుద్ధంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: