విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాక దగ్గం

లక్ష రూపాయల ఆస్తి నష్టం.. 

లబోదిబోమంటున్న రైతన్న

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామానికి చెందిన మూల వెంకటయ్య చెందిన పశువుల పాక మరియు ఇంటి ముందర వేసుకున్న వాసము ప్రమాదవశాత్తు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించి పశువుల పాక,వాసము అగ్నికి ఆహుతి అవుతుండగా గమనించిన వెంకటయ్య స్థానికుల సహాయంతో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొని వచ్చారు.ఈ సందర్భంగా బాధితుడు వెంకటయ్య మాట్లాడుతూ


తెల్లవారుజామున సుమారు 03:30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని,  వ్యవసాయానికి ఉపయోగించే నల్లని నీటి పైపులు 50,తెల్లని నీటి పైపులు10, వ్యవసాయ సాగుకు ఉపయోగించే పనిముట్లు,దాన్యాన్ని నూర్పుడికి ఉపయోగించే పట్టాలు అగ్ని ప్రమాదానికి కాళీ బూడిద అయ్యాయని, అగ్నికి కాలి బూడిదైన వ్యవసాయ సామాగ్రి విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వ అధికారులు జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించి తనని ఆదుకోని న్యాయం చేకూర్చాలని రైతన్న వెంకటయ్య కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: