యాగంటి ఉమామహేశ్వర స్వామికి టీటీడీ పట్టువస్త్రాలు  సమర్పించిన...

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని దంపతులు

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని యాగంటి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా టిటిడి పాలక మండలి సభ్యులు,పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి యాగంటి  ఉమామహేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.యాగంటి దేవస్థానం చరిత్రలో  టిటిడి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

వివరాలలోకి వెళితే తిరుమల తిరుపతి దేవస్థాన జెఈఓ వీర బ్రహ్మం గారు పట్టువస్త్రాలను యాగంటి క్షేత్రానికి తీసుకొని రాగా టీటీడీ పాలక మండలి సభ్యులు మరియు పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు మరియు పాలక మండలి సభ్యులు మారుతీ ప్రసాద్ దంపతులు మేళతాళాలతో ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గర్భగుడిలో స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాగంటి పుణ్యక్షేత్రానికి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో యాగంటి దేవస్థానం ఆలయ నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి,శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, ట్రెజరర్ రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: