మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి

సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాల్ రావు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరగనున్న మెగా జాబ్ మేళాను నగరంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు కోరారు. సోమవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కే వేణుగోపాలరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెజార్ మేళ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో 108 కంపెనీలలో 10 వేల ఉద్యోగాలకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.


10వ తరగతి, ఇంటర్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లమా బిఏ బీకాం ఎంఏ ఎం కామ్ బీఫార్మసీ ఎం ఫార్మసీ బిఈడి ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ అర్హత కలిగిన వారు ఈ జాబ్ మేరను సద్వినియోగం చేయవచ్చు అని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 918247 6721, నైన్ జీరో వన్ ఫోర్ 9014846853, 620 237 48 45 నెంబర్లలో సంప్రదించి సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: