సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ తీసుకెళదాం

పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యం మరియు గడివేముల మండలంలో స్థానిక శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ నందు గృహ సారథుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పాణ్యం టౌన్ జేసిఎస్ పాణ్యం మండల ఇంచార్జ్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన, జేసియస్ గడివేముల మండల ఇంచార్జ్ కోరటమద్ది నాగేశ్వరరెడ్డి అధ్యక్షతన శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ నందు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం శాసనసభ సభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పాణ్యం నియోజకవర్గ పరిశీలకులు జడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణరెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు మధ్య వున్న తేడాను ప్రజలకు వివరించాలని,

వైఎస్సార్సీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ,ప్రతి ఇంటికి సంవత్సరానికి ఎంత లబ్ధిచేకూరుతుందో వివరంగా చెప్పి ప్రభుత్వం ప్రవెశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి అర్హత కలిగి వుండి ఏదైనా పథకం అందని లబ్ధిదారులు ఉంటే వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు తప్పనిసరిగా అందేలా కృషి చేయాలని,గ్రామాలలో ప్రతి ఇంటికి 'మా నమ్మకం నువ్వే జగన్' అను స్టికర్ ను అతికించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమాలలో పాణ్యం మండలంలో జడ్పీటిసి సద్దల సరలమ్మ,మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, ఎంపీపీ హుస్సేన్ బి, గడివేముల మండలంలో జెడ్పీటీసీ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ నాగమద్దమ్మ, రెండు మండలాల్లోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.


.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: