‘విజిట్ మస్జిద్ ’ కార్యక్రమానికి విశేష స్పందన

- జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ’అల్ ఫలాహ్ మస్జిదులో ఏర్పాటు

‘‘మస్జిదు ప్రవేశ ద్వారం వద్ద  చెప్పులు విడిచి..వుజూ అనే ప్రక్రియ ద్వారా  కాళ్లు చేతులు, ముఖం శుభ్రం చేసుకుని మస్జిదులో ప్రవేశించాను. అంతకు ముందు   నా ముస్లిమ్ స్నేహితులు మస్జిదులోకి నన్నెంతో సాదరంగా స్వాగతం పలకడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది. మస్జిదులో అడుగు పెట్టగానే ఎంతో ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాను. పరిసరాలన్నీ ఎంతో డిసిప్లేన్ గా ఉన్నాయి. మస్జిద్ టూర్ అని పెట్టి ఉన్న బోర్డు మీద నా దృష్టి పడింది. ఇస్లామ్ మూల స్తంభాలు, వుజూ, అజాన్, నమాజు, ఖుర్ఆన్  ఈ రోజు వివరించే విషయాలున్నాయి ఆ బోర్డుమీద.  ఆ విషయాలన్నీ తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. మస్జిదులో అంతా కలిసి భోజనమూ తిన్నాము. అజాన్ పిలుపు విన్నంతనే ముస్లిములు మస్జిదుకు వచ్చి నమాజులో నిల్చొవడమూ. ధనిక, పేద, తెలుపు, నలుపు అనే తారతమ్యాలనేవి లేకుండా అంతా కలిసి ఒకే వరుసలో నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం చాలా నచ్చింది. ఇంతకు మించిన సమానత్వ భావన మరెక్కడా కానరాదు. ఖుర్ఆన్ వాక్యాలన్నీ  మానవత్వాన్ని బోధించేవేనని ఈ రోజు తెలిసింది.’’ 


జమాఅతె ఇస్లామీహింద్ హైదరాబాద్ (రాజేంద్రనగర్ శాఖ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘విజిట్ మస్జిద్’ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు హిందూ, క్రైస్తవ, బహుజన సోదరులు పంచుకున్న అభిప్రాయాలివి. రాజేంద్ర నగర్ లోని అల్ ఫలాహ్ మస్జిదులో ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు వికార్ అహ్మద్, ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్, సభ్యులు, కార్యకర్తలు మస్జిద్ సందర్శకులకు ఎంతో ప్రేమగా స్వాగతం పలికారు. ఇస్లామ్ పై తమకున్న సందేహాలు, అపోహలు, అపార్థాలను నివృత్తి చేసుకున్నారు. ‘ఇస్లామ్ లో అంటరానితనం, అసమానతాభావాలకు తావులేదు. మనుషులంతా ఒక్కటే’’ అనే సందేశాన్ని అందించారు. స్త్రీలూ పాల్గొనడం విశేషం. 

రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: