అసెంబ్లీలో పాత నగర రోడ్డు విస్తరణ గురించి ప్రస్తావించినందుకు

ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సన్మానించిన ఎంఐఎం పార్టీ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాత నగరం సమస్యలను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించినందుకు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను యమయం పార్టీకి చెందిన పురాణ ఫుల్ డివిజన్ సీనియర్ నాయకులు సన్మానించారు. పాత నగరంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నదని, వాటి పరిష్కారం కోసం అసెంబ్లీలో ఈ అంశాన్ని ముంతాజ్ అహ్మద్ లేవనేతినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పురాణ ఫుల్ డివిజన్ ఎంఐఎం నేతలు ప్రమోద్ జైన్, సయ్యద్ జహంగీర్, హబీబ్ ఖురేషి, అహ్మద్ సలార్, ఎండి బరార్ తదితరులు పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: