దుర్వేసి గ్రామంలో వరిపొలం బడి నిర్వహించిన...

గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలపరిధిలోని దుర్వేసి గ్రామంలో వరి పొలంబడి కార్యక్రమాన్ని గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి వరి పొలంబడి కార్యక్రమాన్ని దుర్వేసి గ్రామ రైతు పరమేశ్వర రెడ్డి పొలంలో నిర్వహించారు. వరి పొలంబడి కార్యక్రమంలో వరి పంటలు వేసిన రైతన్నలు పాటించవలసిన సూత్రాలను,సలహాలను పంటలకు రైతులు పెట్టవలసిన నీటి తడులను మరియు ఆవశ్యకతను,వరి పంట కావలసిన ఎరువుల వాడకం మరియు చీడపీడల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,


ఖరీఫ్ సీజన్ లో చదరపు మీటర్ కు 33 మొక్కలు,రబి సీజన్ లో చదరపు మీటర్ కి 44 కుచ్చులు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవడం ద్యార తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, నాణ్యమైన పంటను రైతు సోదరుల చేతికి పంట అందుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి వ్యవసాయ శాఖ సిబ్బంది దుర్వేసి గ్రామ రైతన్నలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: