సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన..
గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామ సచివాలయమును గడివేముల మండలం అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా చిందుకూరు గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ తో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అందరు తప్పకుండా వారంలో 3 రోజులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలని,సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం తప్పక బయో మెట్రిక్ హాజరు వెయ్యాలని, సచివాలయ కార్యాలయాల్లో మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంకాలం 05:00 గంటల వరకు స్పందన కార్యక్రమము తప్పనిసరిగా నిర్వహించాలని, సచివాలయ సిబ్బంది స్పందన కార్యక్రమానికి హాజరు కాని వారి వివరాలను జిల్లా కలెక్టర్ గారికి పంపబడుతుందని, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు 10 సేవలు తగ్గకుండా చూసుకోవాలనీ, సచివాలయంలో ఉన్న సేవల గురించి ప్రజలందరికి తెలియజేసి సేవలను ప్రజలు వినియోగించుకోనే విధంగా ప్రజలను ప్రేరేపించాలని,
సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ అందరు మంచి అవగాహన,సఖ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని,గ్రామాల అభివృద్ధి కొరకు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను రూపొందించుకొని అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధి చేయడంలో గడివేముల మండలము వెనుకబడి ఉందని, PMJAY అయుష్మాన్ భారత్ భీమాను త్వరగా పూర్తి చెయ్యాలని గడివేముల ఎంపిడిఓ విజయసింహరెడ్డి ఆదేశించారు.
Home
Unlabelled
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన.... గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: