మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు,,,రండి

ముఖ్యఅతిధిగా విచ్చేయాలని బుక్క వేణుగోపాల్కు ధర్మకర్తల మండలి ఆహ్వానం

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం శివగంగా ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు” ముఖ్య అథితిగా విచ్చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యుల ఆహ్వానాన్ని స్వీకరించిన బుక్క వేణుగోపాల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా హాజరవుతానని నిర్వహాకులకు  అభయమిచ్చారు. ఇదిలావుంటే "శివరాత్రి పర్వదిన మరుసటి రోజున శివగంగా ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్" అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సమస్త హిందూ బంధువులందరూ కూడా పాల్గొని స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించాలని బుక్క వేణుగోపాల్ ఈ సందర్భంగా కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: