రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

సిపిఐ (యంయల్) ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజు

(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో రవాణారంగం కీలక పాత్ర పోషిస్తుందని సిపిఐ (యంయల్) ఆర్ఐ జిల్లా పార్టీ కార్యదర్శి గాలి రవిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలకమైన లారీ ఆయిల్ ట్యాంకర్స్, గ్యాస్ లారీలు,ట్రావెల్స్ బస్సులు,టాక్సీ, జీపు, ఆటోగూడ్స్,ఆటోమ్యాజిక్, టాటా ఏసీ,స్కూల్ బస్సులు మెకానిక్ కార్మిక సోదరులు వాహనాలపై ఆధారపడి దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రోత్సాహం లేకపోయినా శ్రమను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని, శ్రామిక, కార్మిక రంగానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి పెట్రోల్,డీజిల్, సీఎన్జీ గ్యాస్ మోటార్స్ స్పేర్ పార్ట్స్ ధరలు పెంచడంతో పాటు వివిధ రకాల ట్యక్స్ పేరుతో అధిక భారం వేశారని, కరోనా మహమ్మరి  కారణంగా మోటార్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, కేంద్ర,రాష్ట్రప్రభుత్వ విధి, విధానాల ఫలితంగా మోటార్ కార్మికులకు వచ్చే ఆదాయం చాలక జీవనం కొనసాగించడానికి అప్పుల పాలై ఆత్మహత్యలు పాల్పడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయని


,మోటర్ రంగ కార్మికులను కాపాడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా గ్రీన్ టాక్స్,టోల్ టాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచారని,ఇప్పుడు కొత్తగా 30% రోడ్ టాక్స్ పెంచుతూ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితంగా కార్మిక రంగంపై వేలాది రూపాయల అదనపు భారం పెరిగిందని,పోలీస్, ఆర్టీఏ అధికారులు చిన్న చిన్న తప్పులుకి భారీ జరిమానాలు శిక్షలు వేస్తున్నారని,కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వాల నిర్ణయాల వల్ల కుంగిపోతున్న మోటార్ రంగాన్ని కాపాడుకోవాలంటే మోటర్ రంగంలో పనిచేస్తున్న అన్ని వర్గాల కార్మికసంఘాల నాయకులు ఐకమత్యంగా కలసి ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలపై  ఉద్యమించాలని,కార్మిక రంగ సోదరులకు పిలుపునిచ్చారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: