ఇది ప్రజా బడ్జెట్....ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత బడ్జెట్
అభివృద్ధి - సంక్షేమాల సంబరాల బడ్జెట్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రాష్ట్ర అసెంబ్లీలో నేడు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తు తెలంగాణకు బంగారు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పేద,మధ్యతరగతి ప్రజల బడ్జెట్ గా,ముఖ్యంగా రైతు బడ్జెట్ గా మంత్రి అభివర్ణించారు.గ్రామాల,పట్టణాల గతినే మార్చుతున్న పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు 5609 కోట్లు,కళ్యాణాలక్ష్మి, షాది ముబారాక్ లకు 3210 కోట్ల కేటాయింపు గొప్ప విషయం అన్నారు. ఈ బడ్జెట్ లో తాను నిర్వహిస్తున్న విద్యా శాఖకు 19,093 కోట్ల కేటాయించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యా శాఖ కు సంభందించి 7289 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు కొనసాగుతున్నాయని అన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాల కల్పన కు 500 కోట్ల కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు.మహిళ,అటవీ యూనివర్సిటీ లకు 100 కోట్ల నిధుల కేటాయింపు పట్ల సంతోషం వ్యక్తం చేసారు.పేదలపై భారం పడకుండా విద్యా, వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజామోద బడ్జెట్ ను ప్రవేశ పెట్టినందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావుకి విద్యా శాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Home
Unlabelled
ఇది ప్రజా బడ్జెట్....ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత బడ్జెట్. అభివృద్ధి - సంక్షేమాల సంబరాల బడ్జెట్,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: