"శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి" సందర్భంగా
శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడి తన మతాన్ని, సంస్కృతిని కాపాడిన హిందూ హృదయ సామ్రాట్ "శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి" సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అల్లికోల్ తండా గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘన నివాళ్లలర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిజాం వారసుల ఎంఐఎం అడుగు పెట్టనిచ్చే అవకాశమే లేకుండా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటుతూ హిందువులనంత ఏకం చేేసే దిశగా బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అడుగులేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమ్ రాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, అల్లికోల్ తండా సర్పంచ్ రేణుక రాజ్ నాయక్, నర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, ముచ్చింతల్ సర్పంచ్ చంద్రయ్య, ఎంపీటీసీ తొంటా గౌతమీఅశోక్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, బిజెపి శంషాబాద్ నేతలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: