భారీ వాహనాలకు ప్రవేశం లేదు
ఆత్మకూరు ఎస్సై హుస్సేన్ బాషా
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో జరుగుచున్న శ్రీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిద రాష్ట్రాల మరియు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు,భక్తులు మరియు వీఐపీలు,భారీగా దైవదర్శనానికి తరలివస్తున్న కారణంగా 17.02.2023 నుండి 19.02.2023 వరకు దోర్నాల,విజయవాడకు, వెళ్లవలసిన భారీ వాహనాల రాకపోకలకు, ఎటువంటి అవాంతరాలు లేని వాహనాల రాకపోకల దృష్ట్యా కర్నూలు పట్టణం లోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి ఆత్మకూరు - దోర్నాల మీదుగా విజయవాడకు రాకపోకలు నిలిపివేయడం జరిగింది.
కావున వాహనదారులు గమనించి లారీలు, భారీ గూడ్స్ వాహనాలు 17.02.2023 నుండి 19.02.2023 వరకు కర్నూలు పట్టణం నుండి దోర్నాల,విజయవాడలకు, వెళ్ళువాహనాలు నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు,మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవాలని, అదేవిధముగా ఆత్మకూరు నుండి దోర్నాల, విజయవాడలకు వెళ్ళు లారీలు,భారీ గూడ్స్ వాహనాలు ఆత్మకూరు నంద్యాల టర్నింగ్ నుండి వెలుగోడు,బండిఆత్మకూర్,నంద్యాలనుండి,గిద్దలూరు,మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవలసిందిగా ఆత్మకూరు ఎస్సై హుస్సేన్ భాష గారు తెలిపారు.
Home
Unlabelled
భారీ వాహనాలకు ప్రవేశం లేదు.... ఆత్మకూరు ఎస్సై హుస్సేన్ బాషా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: