పాణ్యం దళితుల కాలనీలో దళితులు ను పట్టించుకోరా అభివృద్ధి చేయరా...?
సమస్యలను పాణ్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యులు వనం వెంకటాద్రి, దళిత కాలనీ ప్రజలు ఏఐఎఫ్బి, ఆర్విఎఫ్, ప్రజా సంఘాల నాయకులు
నంది విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యంలో రాజుల కాలంలో బృంగేశ్వరా స్వామి దేవాలయం లో నందీశ్వర విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిగా పని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై నంది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితులు వేదమంత్రాల తో ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు వనం వెంకటాద్రి,ఆర్వీఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్, దళిత కాలనీవాసులు కలిసి మాట్లాడుతూ గుడి పక్కలో దాదాపుగా యాభై సెంట్లు స్థలం ను
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంను దళితుల కోసం ఏర్పాటు చేయాలని, దళిత కాలనీవాసులు చందాలు పోగుచేసుకుని అస్తవ్యస్తంగా ఉన్న స్థలమును శుభ్రపరచుకున్నారని, శుభ్రపరచుకున్న స్థలంను దళితులకు ఇవ్వకుండా స్థలాన్ని దేవస్థానానికి ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పి మాట తప్పడం చాలా బాధాకరమైన విషయని,దళితుల కాలనీలో గెలిచిన తర్వాత నాయకులు మహిళలకు మరుగుదొడ్లు,నీటి వసతి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత 30 సంవత్సరాల నుండి ఉచిత హామీలను నాయకులు ఇస్తూ ఎస్సీ కాలనీ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నా రని, నాయకులు గెలిచిన తర్వాత దళితుల కాలనీలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి శూన్యమని,ఇచ్చిన హామీలను నెరవేర్చి, అభివృద్ధి చేసి దళితుల కాలనీలో వైయస్ఆర్సీపీ నాయకులు ఎస్సీ కాలనీలోదళిత కాలనీని అభివృద్ధి చేయాలనిఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ప్రజాసంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు, దళిత కాలనీ ప్రజలు.
అడుగుపెట్టాలని హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజులలో వైస్సార్ పార్టీ నాయకులను ఎస్సీ కాలనిలోకి రానీయబొమని,ఆస్థలంను వెంటనే ఎస్సీ కాలనీ ప్రజలకు రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ కళ్యాణం మండపం ఏర్పాటు చేసి ఎస్సీ కాలాని ప్రజలకు ఇవ్వాలని కోరిన వనము వెంకటాద్రి,ఆర్విఎఫ్ నాయకులు బత్తిన ప్రతాప్,వనము నాగరాజు, మల్లిపొగు సుబ్బన్న, నెరవాటి సుబ్బారాయుడు, చిలకలబాలన్న తదీతరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: