బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలి
గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి
(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల మరియు చిందుకూరు గ్రామ సచివాలయములను గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో విజయసింహారెడ్డి గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ తో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అందరు వారంలో 3 రోజులు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని, సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా ఉదయం,మధ్యాహ్నం మరియు సాయంత్రం తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలని,మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని కచ్చితంగా నిర్వహించాలని,
స్పందన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా ఉండాలని, స్పందన కార్యక్రమంలో హాజరుకాని సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుందని,ప్రతి సచివాలయంలో ప్రతిరోజు 10 సేవలను ప్రజలకు అందించాలని, సచివాలయంలో ఉన్న సేవల గురించి ప్రజలందరికి తెలియజేసి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సాహ పరచాలని,సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరు సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని గడివేముల ఎంపీడీవో విజయసింహారెడ్డి ఆదేశించారు
Post A Comment:
0 comments: