ఘనంగా గౌతమ్ గ్రూప్ గ్లోబల్ హై స్కూల్ వార్షికోత్సవం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ హై స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని రాజధాని హోటల్లో ఈ వార్షికోత్సవ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో గౌతమ్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ హై స్కూల్ ఉపాధ్యాయ సిబ్బందితో పాటు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఇష్టంతో చదవాలని, ఒత్తిడితో కాదని సూచించారు. విద్యార్థులను చదువు అంటే ఇష్టపడేలా తమ స్కూలు సిబ్బంది కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సవికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలు పోటీలలో విద్యార్థులు విజయం సాధించగా వారికి బహుమతులు కూడా అందజేశారు. పోటీలలో రాణించిన చరికా యాదవ్, లివ్య యాదవ్ లకు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం బహుమతులు అందజేసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: