రంగ రంగ వైభవంగా...

 శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామ సమీపంలోని ఎర్రమల కొండలలో వెలిసి దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళ వాయిద్యాల,వేద మంత్రోచ్ఛరణల మధ్య భోగేశ్వర స్వామి వారి తరుపున సునీల్ కుమార్ రెడ్డి,నాగలక్ష్మి దంపతులు, దుర్గామాత తరపున గణేష్ రెడ్డి, లక్ష్మి దంపతులు పెళ్లి పెద్దలుగా కూర్చుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ రంగ రంగ వైభవంగా నిర్వహించారు. పాణ్యం శాసనసభ సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,


కర్నూలు జిల్లా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ లు స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రైతు సంబరాల్లో బండలాగు ఎద్దుల పంధ్యాలను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి,

గడిగిరేవుల సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి,ఆలయ ధర్మకర్తలు,సిబ్బంది రమణ,భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు గడివేముల ఎస్సై బిటి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నంద్యాల, పాణ్యం,గడివేముల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: