జల్ పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యం

దశాబ్దాలుగా సబితమ్మ ఓటుబ్యాంకు రాజకీయాలే.! 

సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని అందెల సూచన

బీజేపీలో చేరిన యువతకు శ్రీరాములు యాదవ్ భరోసా 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

జల్ పల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారంనాడు జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్ కాలనీలో అనేక మంది యువకులు బీజేపీలో చేరారు. కౌన్సిలర్ ప్రశాంతి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో కాషాయం కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జల్ పల్లి మున్సిపాలిటీని ఓటు బ్యాంకు రాజకీయాలకు మంత్రి సబితమ్మ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.


భవిష్యత్తులో జల్ పల్లి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు అందెల శ్రీరాములు యాదవ్. యువకులు ఎప్పటికప్పుడు భయపడకుండా సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు శాంతి కుమార్, మనోజ్ కుమార్, గొరిగె మల్లేష్, హరికృష్ణ, సుమీత్, శ్రవణ్, రాజేందర్, బాలకృష్ణ, కృష్ణ, సుధాకర్, నాగరాజు, గణేష్, పాతిమా బేగం సహా బీజేపీ, బీజేవైఎం నాయకులు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: