శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసిన... 

ఆత్మకూర్ డిపో మేనేజర్ మహేందర్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా 35 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని ఆత్మకూరు డిపో మేనేజర్ మహేందర్ తెలిపారు. 11.02.2023 నుండి  21.02.2023 వరకు శ్రీశైలంలో జరుగుచున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల  సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్ధం ఆత్మకూరు డిపో నుండి శ్రీశైలంకు 35 ప్రత్యేక ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని, ఈ బస్సు సర్వీసులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా 2022 సంవత్సరంలో వసూలు చేసిన చార్జీలతోనే ప్రస్తుతం (2023) నడుపుతున్నామని, కర్నూలు నుండి శ్రీశైలం  350-00,నందికొట్కూరు నుండి శ్రీశైలం 300-00, ఆత్మకూరు నుండి శ్రీశైలం 250-00,దోర్నాల నుండి శ్రీశైలం 130-00 రూపాయలతో నడుపుతున్నామని,


శివరాత్రి సందర్భంగా 18.02.23 మరియు 19.02.23 వ తేదీన ఆత్మకూరు నుండి  రుద్రకోడూరుకి 10 బస్సులు,సంగమేశ్వరం మరియు కొలను భారతికి 5 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామని,ఈ అవకాశాన్ని భక్తుదులందరూ వినియోగించుకుని శ్రీశైల పరిపూర్ణ యాత్రను సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నామని ఆత్మకూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: