మెడిసిన్ ఫైనల్ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన..

రామకృష్ణ కళాశాల అధినేత జి.రామకృష్ణారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

దేశాభివృద్ధికి ఉపయోగపడే విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడం అదృష్టంగా భవిస్తూ లక్షా ఇరువై ఐదువేలు ఆర్థిక సహాయాన్ని శ్రీ రామకృష్ణ డిగ్రీ,పీజీ కళాశాలల అధినేత జి.రామకృష్ణారెడ్డి చేసారు.పేద విద్యార్థిని విద్యార్థులు డబ్బు సమస్యతో విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న చదువుకు మేము ఉన్నామని ముందుకు వచ్చి విజయవాడలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న  విద్యార్థిని రూ. 1,25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విజయవాడలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కర్నూల్ కు చెందిన షెహనాజ్ పర్వీన్ అనే విద్యార్థినికి లక్ష 25 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. కర్నూల్ కు చెందిన షెహనాజ్ పర్వీన్ అనే విద్యార్థిని డాక్టర్ కావాలనే ఆశయంతో విజయవాడలో డాక్టర్ కోర్సు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోగా చివరి సంవత్సరం పూర్తి చేయడానికి ఆర్థిక సమస్య అడ్డుగా మారిందన్న విషయం తెలుసుకున్న జి. రామకృష్ణారెడ్డి షహనాజ్ పర్వీన్ విద్యార్థినిని పిలిపించి ఆర్టికసహయం అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఉపయోగపడే విద్యార్థినికి సహాయం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని, విద్యార్థిని విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్,నా చిరుకాల స్నేహితుడు, గురువర్యులైన రామకృష్ణారెడ్డిల సూచనల మేరకు విద్యార్థినికి ఆర్థిక సహాయం చేశానని అన్నారు.రామకృష్ణారెడ్డి కోడలు ప్రగతి రెడ్డి మాట్లాడుతూ దేశానికి వైద్య వృత్తి చేసేవారు ఎంతో అవసరమని వారికి సహాయం చేసి వైద్యులుగా చేస్తే నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తారని, మామ రామకృష్ణారెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు విద్యను అందించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని షహనాజ్ పర్వీన్ మాట్లాడుతూ సమాజంలో గురువును దైవంగా భావిస్తారని,పేదలకు తనకు చేతనైన వైద్య సేవలు అందిస్తానని,చదువు పూర్తి కావడానికి సహాయం చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్,లెక్షలర్ రామకృష్ణారెడ్డి,రామకృష్ణా  డిగ్రీ,పీజీ కళాశాల అధినేత జి రామకృష్ణారెడ్డి,ప్రగతి రెడ్డి చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: