తెలంగాణ బడ్జెట్ లో సరుకు లేదు, సంగతి లేదు

ఏదో ఒకటి చెప్పి తెలంగాణ సెంటిమెటు రగిల్చేయత్నం

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి ప్రతి సారి కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇచ్చిందని మొత్తుకునే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు బడ్జెట్లో మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఏమి కేటాయించారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, రాజేంద్రనగర్ సీనియర్ నేత బుక్క వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రజలకు ఎంతో అవసరమైన అంశలు, విద్య, ఆరోగ్యమని ఆయన తెలియజేశారు. అలాంటి విద్య, వైద్యం శాఖలకు బీఆర్ఎస్ సర్కార్ ఏ మేర కేటాయించిందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.  ఆసరా పెన్షన్ కు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆరోగ్యానికి, విద్య శాఖలకు బడ్జెట్ లో ఇవ్వలేదని బుక్క వేణుగోపాల్ విమర్శించారు. ఎందుకు ఈ రంగల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.


దేశంలోని అన్ని రాష్ట్రాలు విధ్య కోసం సగటున 15.2% ఖర్చు చేస్తుంటే మన కెసిఆర్ సర్కార్ మాత్రం 6.5% మాత్రమే బడ్జెట్ లో కేటాయించారని ఆయన తెలిపారు. దీంతో కేసీఆర్ కు విద్య మీదున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేటతెల్లమైందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి ఊసే లేదని, మొత్తంగా తెలంగాణ 2023-24 బడ్జెట్ ను కేసీఆర్ దొర మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు... సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు,,అంతా వట్టిదే డబ్బ,,బభ్రాజమానం భజగోవిందం అన్నట్లుగా ఉందని బుక్క వేణుగోపాల్ అభివర్ణించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: