అజ్మతుల్లా ఖాన్ మృతికి కారణమైన..

 ఆర్జియం కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

విద్యార్థి.. ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం మండలం నేరవాడ వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో‌ అజ్మతుల్లా ఖాన్ (22) సిఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంపై నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ధనంజయుడు, ఆర్విఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఆర్ఎస్ఏ అధ్యక్షుడు వెంకట్,ఆర్విఎఫ్ జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్,                                               ‌సిపిఐ (యంయల్) ఆర్ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్, ఏఐఆర్ఎస్ఓ జిల్లా అధ్యక్షుడు రమేష్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు, ప్రజా సంఘల నాయకులు  మాట్లాడుతూ ...


నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ దగ్గర ఉన్న ఆర్జియం ఇంజనీరింగ్ కళాశాలలో సియస్సి మెదటి సంవత్సరం చదువుతున్న కోవెలకుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి అజ్మతుల్లా ఖాన్(22) అనే విద్యార్థి హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణమని,

ఆర్జీఎం కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని  శాంతిరామ్ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించి మరణించాడని ధృవీకరించుకున్న తర్వాత నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ మార్చారీ గదిలో గుట్టు చప్పుడు కాకుండా వదిలి వెళ్లిన శాంతిరాం హాస్పిటల్ సిబ్బంది పై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ యాజమాన్యం మరియు కళాశాల యాజమాన్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలిని,విద్యార్థి మనోవేదనకు గురిచేసి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని,ఆర్జీఎం కాలేజీ హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని,విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని సహచర హాస్టల్ విద్యార్థులు తెలుపుతున్నారని, మృతి చెందిన కోవెలకుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి అజ్మతుల్లా ఖాన్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు కాలేజీ ముందు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోరాడతామని హెచ్చరించిన విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: