రాష్ట్ర గవర్నర్  పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన... 

జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి రఘువీర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సందర్శించుకోవడానికి వస్తున్న సందర్భంగా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి కె. రఘువీర్ రెడ్డిలు ఆదివారం పర్యవేక్షించారు. సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని పరిశీలిస్తూ ప్రోటోకాల్ ప్రకారం హెలిప్యాడ్ ఏర్పాట్లు, చుట్టూ బ్యారికేడింగ్,  తాత్కాలిక శౌచాలయాల ప్రదేశాలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  సున్నిపెంట్ హెలిప్యాడ్ మైదానం నుండి మాక్ ట్రయల్ రన్  నిర్వహిస్తూ మార్గమధ్యములో పారిశుద్ద్య చర్యలు,ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు,


సలహాలు జారీ చేశారు. అనంతరం భ్రమరాంబా అతిథిగృహం నుండి ప్రధానాలయగోపురం ఎదురుగా గల గంగాధర మండపం వద్దకు చేరుకుంటారని అక్కడినుండి శ్రీకృష్ణ దేవరాయగోపురం వద్ద రాష్ట్ర గవర్నరుకు ఆలయ సంప్రదాయాలతో అర్చకులు పూర్ణకుంభం తో ఆలయంలోకి స్వాగతం పలికి శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి జరిపే ప్రత్యేక పూజా కార్యక్రమాలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారితో చర్చించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, గవర్నర్ ప్రోటోకాల్ అధికారి ఉదయరాజు,దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న,ఆత్మకూరు ఆర్డిఓ దాసు,జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్ డిఏ పీడి శ్రీధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: