మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలసిన రంగారెడ్డి...వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు
కొత్త కలెక్టర్లను అభినందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ హరీష్
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రెండు జిల్లాలలో కలెక్టర్లు వేర్వేరుగా వచ్చి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన హరీష్ శుక్రవారం నాడు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి కలెక్టర్ పూలకుండిని అందజేశారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ్ రెడ్డి
ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ ను మంత్రి అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారం లో ప్రత్యేక చొరవ చూపాలని జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్లాలని సూచించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన నారాయణ్ రెడ్డి సైతంం హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను విద్యా శాఖ మంత్రి అభినందించారు.
Post A Comment:
0 comments: