ఆసుపత్రి పాలైన విద్యార్థి జయంతికకు న్యాయం చేయండి

అందుకు కారణమైన శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకోండి

డిప్యూటీ తాసిల్దార్ అరుణకు వినతి పత్రం అందజేసిన బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం

జయంతిక కు న్యాయం చేయాలని ఆత్మకూరు డిప్యూటీ తాసిల్దార్ అరుణకు...... వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి జయంతిక కు న్యాయం చేయాలని డిప్యూటీ తాసిల్దార్ అరుణకు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ, ఏఐఎస్ఏ నాగార్జున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సున్నిపెంటలో ఉన్న శ్రీశైలమాత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి జయంతిక ను పాఠశాల ఉపాధ్యాయిని తలపై బలంగా కొట్టడంతో చెవిలో నుండి రక్తం కారటం ద్వారా మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారనీ, చికిత్స పొందుతున్న విద్యార్థి జయంతికను ఇంతవరకు విద్యాశాఖ ఉన్నత అధికారులు గానీ, శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం గాని విద్యార్థి వద్దకు వెళ్లి పరామర్శించకపోవడం సిగ్గుచేటని, విద్యార్థి జయంతిక తలపై బలంగా కొట్టిన ఉపాధ్యాయనీ పై స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యంమేమని,


తక్షణమే శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుర్తింపు రద్దుచేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థి, యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ, ఏఐఎస్ఎ జిల్లా నాయకుడు నాగార్జున డిప్యూటీ తాసిల్దార్ అరుణను ఈ సందర్భంగా వారు కోరారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన డిప్యూటీ తాసిల్దార్ అరుణ మాట్లాడుతూ శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యంపై విచారణ జరిపి బాధ్యులైన ఉపాధ్యాయులపై చట్టపర్యమైన చర్యలు తీసుకొని విద్యార్థికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రమేష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: