భావితరాలకు చారిత్రక వారసత్వం అందించే పుస్తకం అమ్మకు అక్షర నైవేద్యం
- రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
భావితరాలకు చారిత్రక వారసత్వం అందించే పుస్తకం అమ్మకు అక్షర నైవేద్యం అని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. శ్రీ మహాకాళీ మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు జి.అరవింద్ కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ లు సోమవారం ఆర్.కృష్ణయ్య ను విద్యానగర్ లోని అయన నివాసంలో కలిసి అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ సాహితీ చరిత్రలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 526 మంది కవులు,కవయిత్రులు లాల్ దర్వాజా సింహవాహినీ శ్రీ మహాకాళి అమ్మవారిని కీర్తిస్తూ సమర్పించిన కవితల బోనం అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం భవిష్యత్ తరాలకు ఓకే మహా కావ్యం గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పుస్తకం కార్యరూపం దాల్చడానికి అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ గౌని మహేష్ గౌడ్ చిరస్మణీయుడు అన్నారు.
Home
Unlabelled
భావితరాలకు చారిత్రక వారసత్వం అందించే పుస్తకం అమ్మకు అక్షర నైవేద్యం - రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: