సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా...

చారిత్రాత్మక లాల్ ధర్వాజ సింహవాహినీ  శ్రీ మహాంకాళీ అమ్మవారికి పట్టు వస్రాల సమర్పణ

ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్,   బద్రీనాథ్ గౌడ్  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు , ఆలయ సంప్రదాయ ప్రకారం బ్యాండ్ మేళాలతో అమ్మవారికి పట్టు  వస్త్రాలు , పూలు , పండ్లు స్వీట్స్ ఊరేగింపుగా  తీసుకోని  వచ్చారు. అమ్మ వారికీ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భముగా పట్టు వస్త్రాలు సమర్పించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.కెసిఆర్ అమ్మవారి  కృప  కటాక్షాల  ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో  నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని అమ్మవారిని కోరడం జరిగింది. పూజా అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాషేఖం చేసి ప్రజలకు మిఠాయిలు పంచిపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్రం సాధించిన సందర్భంగా 2014 వ సంవత్సరంలో కెసిఆర్ సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారికి బంగారుబోనం సమర్పించి అమ్మవారి ఆలయ విస్తరణకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీమేరకు 2023  ఫిబ్రవరిలో బట్జెట్ సమావేశాల సంధర్భముగా అసెంబ్లీ లో అమ్మవారి ఆలయ విస్తరణ గురించి చర్చించడం జరిగిందనీ,


కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు 2023 సంవత్సరం ఆశాడమాస బొనాలకంటే ముందుగా ఆలయవిస్థరణ చేపట్టాలని ముఖ్యమంత్రికి    రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోరిక అని వారు పేర్కొన్నారు. ఈ పూజ  కార్యక్రమంలో ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ లు పోసాని సురేందర్ ముదిరాజ్, బద్రీనాథ్ గౌడ్ ,  సి శివ కుమార్ యాదవ్, ఎస్ రాజ్ కుమార్ , ఆలయ ప్రతినిధులు  కాశి నాథ్గ గౌడ్ , పోసాని సదానంద్ , ప్రభు, బి ర్ స్ నాయకులు తిరుపతి నాగరాజ్, విష్ణు గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్,    శేఖర్ , ప్రభు గౌడ్, రంగ హరి గౌడ్, అభినాష్ తదితరులు పాల్గొన్నారు .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: