విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన బోధన బోధించాలి....

నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారిని అనురాధ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిదిలోని కరిమద్దేల జడ్పిహెచ్ఎస్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారినీ అనురాధ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీలలో భాగంగా మూడు, నాలుగు, ఐదు తరగతులకు ఉపాధ్యాయులు విద్యార్థినీ,విద్యార్థులకు విద్యాభ్యాస బోధన ఏ విధంగా బోధిస్తున్నారని అని,విద్యాభ్యాసం ఏ విధంగా జరుగుతున్నదని విద్యార్థులను అడిగి తెలుసుకొని,


విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చే పని పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయులకు విద్యార్థిని,విద్యార్థులకు బోధనలో నేర్పవలసిన మెలకువలను, సూచనలను,సలహాలను అందించిన అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి,పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుకునేందుకు ఉపాధ్యాయులు విద్యార్థిని,

విద్యార్థులకు ఉన్నతమైన,నాణ్యమైన విద్యను బోధించాలని సూచించిన అనంతరం కరిమద్దేల గ్రామ సచివాలయాన్ని సందర్శించి పాఠశాలలో నాడు-నేడు కింద జరుగుతున్న పనులు ఎంత శాతం వరకు పూర్తయ్యాయని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గడివేముల ఎంఈఓ రామకృష్ణుడు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: