బీఎస్పీ చార్మినార్ నియోజకవర్గ అధ్యక్షుడిగా
రాంచరణ్ దాస్ నియామకం
కండువ కప్పి పార్టీలోకి మూల రాంచరణ్ దాస్ ను ఆహ‍్వానించిన ప్రవీణ్ కుమార్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
బీఎస్పీ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మూల రాంచరణ్ దాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు మూల రాంచరణ్ దాస్ ను బీఎస్పీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు చాట్ల చిరంజీవి సమక్షంలో పార్టీ కండువ కప్పి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆహ్వానించారు. పాతబస్తీకి చెందిన మూల రాంచరణ్ దాస్ వీకర్ సెక్షన్ అండ్ మైనార్టీ వెల్పేర్ డెవలప్ మెంట్ నగర అధ్యక్షునిగా, అంబేదర్ సంఘం నగర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
ఇలా మూల రాంచరణ్ దాస్ రెండు దశాబ్దాలకు పైగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన నిరంతరం పనిచేస్తూ వస్తున్నారు. తమ సంస్థల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయన కొనసాగించారు. తమ సంస్థ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణతోపాటు యువతకు వివిధ నైపుణ్య కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు అందించారు. బీఎస్పీ చార్మినార్ నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా మూల రాంచరణ్ దాస్ కు ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, పాతబస్తీ ప్రముఖులు అభినందించారు.
Post A Comment:
0 comments: