అంబేడ్కర్ విగ్రహన్నీ ధ్వంసం చేసిన...దుండగులను కఠినంగా శిక్షించాలి

విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక బొమ్మసత్రం వద్ద ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి,యువజన,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు,ఏపీ దళిత, గిరిజన సమైక్య సంఘం నాయకులు, సీపీఐ (యంయల్)ఆర్ఐ పార్టీ నాయకులు,ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నంద్యాల నగరంలో బొమ్మలసత్రం వద్ద ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని రాత్రి సమయంలో ద్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ,ఆర్డీవో, అటవీశాఖ కార్యాలయాలు కూత వేటు దూరంలో ఉన్న కూడా అంబెడ్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని,గతంలోనే అంబెడ్కర్ విగ్రహాన్ని నంద్యాల నగర నడి బొడ్డులో పెట్టాలని ఎన్నో ధర్నాలు,దీక్షలు,పోరాటాలు చేశామని,జిల్లా కలెక్టర్ గారు కాని,స్థానిక ఎమ్మెల్యే గారు కాని,ఎంపీ గారు కానీ స్పందించక పోవడం చాలా బాధాకరమైన విషయమని, నంద్యాల నడ్డి బోడ్డున ఉన్న అధికార,ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన విగ్రహాలకు లేని అడ్డు,ప్రపంచ మేధావి,


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి మాత్రమే అడ్డు రావడం చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన విషయమని, ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు,స్థానిక ఎంపీ గారు,స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల ప్రధాన సెంటర్లలలో ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భారీ ఎత్తున నిరసనలకు, ఆందోళనకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, ఏపీ దళిత గిరిజన సమైక్య సంఘం రాయలసీమ నాయకులు సిపిఐ (ఎంఎల్)ఆర్ఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: