సిద్దేశ్వరం కృష్ణానదిపై...తీగల వంతెన వద్దు 

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన రాయలసీమ నంద్యాల జిల్లా స్టీరింగ్ కమిటీ కన్వీనర్లు 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

సిద్దేశ్వరం కృష్ణానదిపై తీగల వంతెన వద్దని బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా 167 కే హైవే నిర్మాణంలో సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి (తీగల వంతెన) నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని, ఐకానిక్ బ్రిడ్జి ద్వారా రాయలసీమ ప్రజలకు గాని,రైతులకు గాని ఎటువంటి లాభం ఉండదని ఐకానిక్ బ్రిడ్జి కాకుండా బ్రిడ్జి మరియు బ్యారేజ్ ని నిర్మించాలని కోరుతూ రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో  రాయలసీమ ప్రాంతంలోని 52 మంది ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయడం జరుగుతుందనీ,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొనివచ్చి తీగల వంతెన కాకుండా బ్రిడ్జి మరియు బ్యారేజ్ ను నిర్మిస్తే రాయలసీమ ప్రజల,రైతుల నీటి కష్టాలు తీరుతాయని విన్నవిస్తు నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దేశ్వరం కృష్ణానదిపై బ్రిడ్జిపై ఐకాన్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేవలం టూరిజం శాఖ మాత్రమే అభివృద్ధి చెందుతుందే తప్ప తీగల వంతెన వలన రాయలసీమ ప్రాంత ప్రజలకు,రైతులకు ప్రయోజనం శూన్యమని, ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం వద్దని,బ్రిడ్జి మరియు బ్యారేజ్ నిర్మించడం వల్ల 70 టీఎంసీల నీటి నిల్వను ఏర్పాటు చేసుకోని రాయలసీమ ప్రాంత ప్రజల మరియు రైతుల నీటి కష్టాలను తీర్చుకోవచ్చని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కోరారని,సిద్దేశ్వరం కృష్ణా నదిపై ఐకాన్ బ్రిడ్జి(తీగల వంతెన) వద్దని బ్రిడ్జి మరియు బ్యారేజ్ నిర్మించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమస్యను తెలియజేస్తామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు యం.వి. రమణారెడ్డి,రాసామళ్ళ నరసింహ యాదవ్, ఎర్రలింగన్న,లింగమయ్య, శీలం నందకుమార్ యాదవ్,శివప్రసాద్ రెడ్డి, గాలి రవిరాజ్,గుంటికపోగు నాగరాజు,మౌలాలి, శ్రీనివాసులు,గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: