మహానంది మండల అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు...
అందని ద్రాక్షగా పౌష్టికాహారం
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలు ఆహారం కొరతతో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలు సఫలీకృత మవుతున్నాయనే చెప్పవచ్చు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందెలా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్ద, మధ్యాహ్నం భోజన పథకాలు ఎంత ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టారు.
అయితే మహానంది మండలంలో మాత్రం ఇందుకు భిన్నంగా కొనసాగుతుంది. దాదాపుగా 25 రోజుల నుంచి అంగన్వాడీ కేంద్రాలలో పసిపిల్లలకు గుడ్డు అందని ద్రాక్షగా మారింది.పర్యవేక్షణ అధికారుల నిర్లక్షవైకరి, కేంద్రాల నిర్వాహకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కుఅయి పిల్లకు మురిగిన గుడ్లనే అందజేస్తున్నారని,కొన్ని గ్రామాలలో పప్పు చెక్క పక్కదారి పడుతున్నాయని, అటుకులు అడ్రస్ లేకుండా పోయాయని,చిన్నారులు పౌష్టికాహారం తీసుకుని బలంగా పెరిగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తుంటే, మహానంది మండలంలో అధికారులు మాత్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి గండి కొట్టి లక్ష్యం కొండెక్కినట్లు తెలుస్తుంది.
బాలింతలకు, గర్భవతులకు అందించాలసిన రాగిపిండి, జొన్నపిండి,తదితర పౌష్టికాహార పదార్ధాలు అందడం లేదని బాధితులు, ప్రజలు తెలుపుతున్నారు.త్వరలో బిసి సంగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు బిసి సంగం నాయకులు తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రాలపై దృష్టి సారించి పౌష్టికాహారాన్ని అందరికీ అందేలా చూడాలని మహానంది మండల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Home
Unlabelled
మహానంది మండల అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు... అందని ద్రాక్షగా పౌష్టికాహారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: