ముద్దులు పోయి.... గుద్దులు వచ్చాయి

వైసీపీ సర్కార్ పై గౌరు దంపతుల ఘాటు విమర్శలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేములలో నూతన టిడిపి కార్యాలయాన్ని నంద్యాల జిల్లా  పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి, పాణ్యం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మండల నాయకుల,కార్యకర్తల, అభిమానుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను ఇంటికి సాగనంపడానికి రాష్ట్రంలోనీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలోనీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని పేరు ఏదో తెలియని పరిస్థితులను నెలకొల్పి రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి జరగకుండా పరిపాలన కొనసాగుతుందని,


ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ప్రజలకు ముద్దులు పెట్టి నేడు గుద్దులు గుద్దుతున్నాడని,రాష్ట్ర పరిపాలన అభివృద్ధి జరగాలంటే కేవలం ఒక టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని, అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని తెలిపారు.పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి  మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భూదందాలకు, కబ్జాలకు,గాలి దందాలకు కేరాఫ్ అడ్రస్ గా పాణ్యం నియోజకవర్గంను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.గడివేముల మండలం అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ఆకాశానంటి పేదల నడ్డి విరుస్తున్నారని,
సమావేశంలో మాట్లాడుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

వైసిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలందరికీ తెలియజేసి ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేసి రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకురావా లనీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి,సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి,మహిళా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ,ఒడ్డు లక్ష్మీదేవి,బీసీ సెల్ అధ్యక్షుడు అంగజాల కృష్ణ యాదవ్,ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్ భాషా,ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగశేషులు,ఓందుట్ల సర్పంచ్ గంగాధర్ రెడ్డి, గడివేముల మండలంలోని వివిధగ్రామాల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నంద్యాల జిల్లా  పార్లమెంటు టీడీపీ కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: