సిటీలో వరల్డ్ హిజాబ్ డే వేడుకలు
హిజాబ్ ప్రాధాన్యతపై అవగాహన పెంచే దిశగా అడుగులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
సిటీలో ముస్లిమ్ మహిళలు వరల్డ్ హిజాబ్ వేడుకలు జరుపుకున్నారు. రంగురంగుల హిజాబ్ వస్త్రాలను తమ స్నేహితురాళ్లకు కానుకగా అందించారు. హిజాబ్ ఎందుకు? ఏమిటి? అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఇదిాలావుంటే ‘స్త్రీలు తల వెంట్రుకలు, మెడ, ఛాతీ భాగం కనపడకుండా తలపై వస్త్రాన్ని కప్పుకునే ఈ పద్ధతి నాకెంతో నచ్చింది. కుల, మతాలకు సంబంధం లేకుండా తలపై వస్త్రాన్ని కప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది.’’
‘నా ఫ్రెండ్స్ లో చాలామంది ముస్లిమ్ అమ్మాయిలు హిజాబ్ ధరించి కాలేజీకి వస్తారు. వారంతా ఎంతో హుందాగా, మర్యాదగా ఉంటారు. చదువుల్లో చురుగ్గా ఉంటారు. వాళ్లు ధరించే హిజాబ్ వస్త్రం వాళ్ల చదువులకు ఏమాత్రం అడ్డంకి కాదు. నా దృష్టిలో ఇది మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్’’ అని చాలామంది యువతులు హిజాబ్ పట్ల ఆసక్తిని చూపుతూ చెప్పిన మాటలివి. బుధవారం వరల్డ్ హిజాబ్ డే సందర్భంగా సిటీలోని పలువురు ముస్లిమ్ మహిళలు రంగు రంగుల హిజాబ్ లను తమ స్నేహితురాళ్లకు కానుకగా అందించారు.
Home
Unlabelled
సిటీలో వరల్డ్ హిజాబ్ డే వేడుకలు,,,,హిజాబ్ ప్రాధాన్యతపై అవగాహన పెంచే దిశగా అడుగులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: