2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా... 

నామకరణం చేసిన.... ఐక్యరాజ్యసమితి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన రైతన్నలకు చిరుధాన్యాల విస్తీర్ణం పెంచుట మరియు పోషక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల శాస్త్రవేత్తలు నరసింహ, అనిల్ కుమార్ లు మాట్లాడుతూ 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి వారు పేరు పెట్టారని, రైతన్నలకు 60 రోజుల నుండి 90 రోజులలోపు పంట చేతికి అంది వచ్చే కోర్ర లో రకాలైన గరుడ,రేనాడు మహానంది యాజమాన్య పద్ధతులపై మరియు జొన్న లో రకాలైన పంటలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతన్నలకు అవగాహన కల్పించారు.


అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావు మాట్లాడుతూ చిరుధాన్యాల విస్తీర్ణం సాగు పెంపుతో,వినియోగం తో రైతులకు మరియు ప్రజలకు కలుగు ఆరోగ్య లాభదాయాల పైన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2023 వ సంవత్సరంలో పూర్తిగా ఐవైఎం కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. సహాయ వ్యవసాయ సంచారకులు నంద్యాల రాజశేఖర్ మాట్లాడుతూ 2023 వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు చిరుధాన్యాలపై చేయు కార్యక్రమాల గురించి రైతన్నలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి, గడిగరేవుల రైతన్నలు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: