రోల్లపాడు గ్రామం శ్రీ బరక సంజీవరాయ స్వామి వారి
ఘనంగా 12 వ వార్షికోత్సవ ఉత్సవాలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని రోల్లపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బరక సంజీవరాయ స్వామి 12 వ వార్షికోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి, కార్యదర్శి వంగాల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతా రాముల స్వామి వారి కళ్యాణం, రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.https://youtu.be/yWBkwvzZUWA
అదే సందర్భంలో ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పోటీలు కూడా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి నంద్యాల జిల్లా నుండే కాకుండా కర్నూలు జిల్లా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు దేవస్థానం కమిటీ వారు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూర్ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం వైద్యులను, 108 సేవలను కూడా అందుబాటులో ఉంచారు
Home
Unlabelled
రోల్లపాడు గ్రామం శ్రీ బరక సంజీవరాయ స్వామి వారి ,,, ఘనంగా 12 వ వార్షికోత్సవ ఉత్సవాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: