ఫిబ్రవరి 2023

 చిన్న వయసులో ఇండియా బుక్ ఆఫ్  రికార్డ్స్ లో ఎక్కిన...

పాతబస్తీ వాసి ఎన్.గౌతమ్ రాజ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

చిన్న వయసులోనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎన్.గౌతమ్ రాజ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. అతి తక్కువ సమయంలో సుద్ద ముక్కపై ఇండియా నమూనా చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సూక్ష్మ చిత్ర కళాకారుడిగా  ఉప్పుగూడ ఆర్.కె.ఎస్.మిషన్ స్కూల్ విద్యార్థి ఎన్.గౌతమ్ రాజ్ స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా ఎన్.గౌతమ్ రాజ్ ను  పాఠశాల ప్రిన్సిపల్ ఎ.కిషన్ రావు, కరస్పాండెంట్ వి.వెంకటాచారి సన్మానించి, నగదు బహుమతి అందజేశారు. 



 భావితరాలకు చారిత్రక వారసత్వం అందించే పుస్తకం   అమ్మకు అక్షర నైవేద్యం 

 - రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

భావితరాలకు చారిత్రక వారసత్వం అందించే పుస్తకం  అమ్మకు అక్షర నైవేద్యం అని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. శ్రీ మహాకాళీ మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు జి.అరవింద్ కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ లు సోమవారం ఆర్.కృష్ణయ్య ను విద్యానగర్ లోని అయన నివాసంలో కలిసి అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకాన్ని అందజేశారు.


ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ  తెలంగాణ సాహితీ చరిత్రలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 526 మంది కవులు,కవయిత్రులు లాల్ దర్వాజా సింహవాహినీ శ్రీ మహాకాళి అమ్మవారిని కీర్తిస్తూ సమర్పించిన కవితల బోనం అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం భవిష్యత్ తరాలకు ఓకే మహా కావ్యం గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పుస్తకం కార్యరూపం దాల్చడానికి  అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ గౌని మహేష్ గౌడ్ చిరస్మణీయుడు అన్నారు.

 సింహవాహిని క్యాలెండర్ ఆవిష్కరణ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాయిని మహంకాళి ఆలయ కమిటీ రూపొందించిన 2023 24 వార్షిక క్యాలెండర్ ను సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ సమక్షంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు. ఐడీసీ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల చారి ఆవిష్కరించారు. లాల్ దర్వాజా  సింహవాహిని శ్రీ  మహంకాళి ఆలయ ఫోర్ మెన్ కమిటీ అమ్మవారి దశావతార రూపాలతో రూపొందించిన  క్యాలెండరు ఆవిష్కరించి డాక్టర్ వేణుగోపాల చారి పంపిణీ ప్రారంభించారు.


ఆలయ కమిటీ ప్రతినిధుల అభ్యర్థన మేరకు ఏడు వారణాసి కాశీ శ్రీ విశాలాక్షి అమ్మవారికి లాల్ దర్వాజా ఆలయ కమిటీ తరఫున బోనాల సమర్పణ ఉత్సవ వేడుకలను నిర్వహించడానికి అవసరమైన సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా వేణుగోపాల చారి హామీ ఇచ్చారు.  లాల్ దర్వాజా మహంకాళి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి  వేడుకలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయన్నారు. ముఖ్యమంత్రి మాన్యశ్రీ కే చంద్రశేఖర రావు గారు త్వరలో ఆలయ విస్తరణ పనులను ప్రారంభించేందుకు రా నున్నారు .

ఈ కార్యక్రమానికి సింహాన్ని మహంకాళి ఆలయ ఫర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్ అధ్యక్షుడు వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్యము చరిత్ర ప్రాధాన్యత క్యాలెండర్ ప్రచురించడానికి  కారణాలను వివరించారు. క్యాలెండర్ చూడగానే అమ్మవారి భక్తిలో లీనమయ్యే విధంగా అద్భుతంగా డిజైనింగ్ చేసి విడుదల చేస్తున్నట్టు చెప్పారు.

అనంతరం సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ ప్రసంగిస్తూ సింహవాయిని అమ్మవారి  బోనాల వేడుకలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుర్తింపు పొందాయి అన్నారు. ఏడు కాశి విశాలాక్షి సమక్షంలో బోనాల వేడుకలను జరుపుకునే ఏర్పాట్లు జరగటం ముదావహమన్నారు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు.  మొదట ముఖ్య అతిథులు డాక్టర్ వేణుగోపాల దైవజ్ఞ శర్మ లకు ఆలయ కమిటీ తరఫున సురేందర్ ముదిరాజ్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఆలయంలో నికి తోడుకొని వచ్చారు. అనంతరం వేణుగోపాల చారి దైవజ్ఞశర్మలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ కమిటీచైర్మన్లు  పోసాని సురేందర్ ముదిరాజ్,  బద్రీనాథ్ గౌడ్,   మాజీ చైర్మన్లు కాశీనాథ్ గౌడ్ విష్ణు గౌడ్ , విజయ్ కుమార్, సి వెంకటేష్, మరియు పోసాని సదానంద్ ,  సుధాకర్ ముదిరాజ్.   రంగ శ్రీకాంత్ గౌడ్. ప్రభు ,ధర్మవీర్ .శేఖర్ , రంగ హరి నాథ్ గౌడ్, తిరుపతి నాగరాజ్, కొండల్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు .


 అమ్మకు అక్షర నైవేద్యం  పుస్తకం చరిత్రలో నిలుస్తుంది 

-హర్యానా గవర్నర్  దత్తాత్రేయ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రీ మహాకాళీ మహేష్ గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు జి.అరవింద్ కుమార్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కె.వెంకటేష్ లు శనివారం గవర్నర్ దత్తాత్రేయ ను రాంనగర్ లోని అయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి అమ్మకు అక్షర నైవేద్యం పుస్తకాన్ని అందజేశారు.ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ  తెలంగాణ చారిత్రిక నేపథ్యం, బోనాల సంస్కృతి, లాల్ దర్వాజా సింహ వాహినీ శ్రీ మహాకాళి అమ్మవారిని కీర్తిస్తూ దేశ విదేశాల్లో ఉన్న జగత్గురువులు,పండితులు కవులు, కవయిత్రులు ,ఎందరో మహానుభావులు రాసిన దాదాపు 526 కవితల తో కూడిన పుస్తక సంకలనం చరిత్రలో నిలిచి పోతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.  ఈ మహ కార్యానికి  కారకుడు అయిన స్వర్గీయ గౌని మహేష్ గౌడ్ చిరస్మణీయుడు అని దత్తాత్రేయ   కొనియాడారు.

 శంషాబాద్ కు ఈఎస్ఐసీ మంజూరు చేసి

సబ్ కా సాథ్...సబ్ కా వికాస్ అని ప్రధాని నరేంద్ర మోడీ రుజువుచేశారు

ఓట్ల కోసం హామీ ఇచ్చిన కేసీఆర్ మాత్రం గెలిచాక విస్మరించారు

ఈఎస్ఐసీ ఆసుపత్రి మంజూరు చేసినందుకు ప్రధానికి, కేంద్ర మంత్రి ధన్యవాదాలు

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ పట్టణానికి 100 పడకల ఈఎస్ఐసీ హాస్పిటల్ ను మంజూరు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మంత్రివర్యులు యాదవ్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ....


సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక్క నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి పేదవారికి పెద్దన్న లాగా అండగా నిలుస్తున్నాని ఆయన కొనియాడారు. కేవలం ఓట్ల కోసం శంషాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తెస్తాం అని రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పటివరకు ఆ హామీ ఊసేత్తలేదని బుక్క వేణగోపాల్ విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి, మన తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీనే శ్రీరామ రక్షా అని రాష్ట్ర ప్రజలందరు గుర్తించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు మంచి విద్య, ఉచిత వైద్యం అని ఆయన పేర్కొన్నారు. 

 పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో...

అన్నదాన కార్యక్రమం... పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అమావాస్యను పురస్కరించుకొని దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . పురానాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్పదని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీలో దేవాలయాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు దోరేటి ఆనందగుప్త, వెంకటాచల ముదిరాజ్ కట్టా నర్సింహారావు తో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

 మల్లన్న స్వామి దేవాలయ చైర్మన్...

నర్సింగ్ రావు (యాకూబ్ భాయ్) కన్నుమూత


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బహదూర్పురా మల్లన్న స్వామి దేవాలయ చైర్మన్ నర్సింగ్ రావు (యాకూబ్ భాయ్) సోమవారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారము నాడు మృతి చెందారు  ఆయన మరణ వార్త తెల్సుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో ఆయన భౌతిక కాయని సందర్శించి నివాళులు అర్పించారు. బహదూర్పురాలోని మల్లన్న స్వామి దేవాలయం కబ్జాకు గురవుతుండటంతో దశాబ్దాల పాటు పోరాటం చేసి కబ్జాదారుల నుండి ఆలయాన్ని రక్షించి దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని ప్రజలు గుర్తు చేసుకున్నారు. బహదూర్పురాలోని స్మశాన వాటికలో ఆయన అంతక్రియలను నిర్వహించారు

 ఖాదర్ ఖాన్ ది ప్రభుత్వ హత్య

ఆయన కుటుంబానికి రు.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి

బహుజన సమాజ్ పార్టీ డిమాండ్

మెదక్ జిల్లాలో ఇటీవల లాక్ అభ్యర్థులు మరణించిన ఖాదర్ ఖాన్ కోటి రూపాయలు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఎస్పీ డిమాండ్ చేసింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని విమర్శించింది. సోమవారం నాడు పాతబస్తీలో ఉండే ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను బీఎస్పీ పార్టీ నేతలు అబ్రహం హుస్సేన్, మౌలానా మసూదీ షఫీ, చాట్ల చిరంజీవి, మూల రామ్ చరణ్ దాస్ పరామర్శించారు. ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను అడిగి వాస్తవాలను సేకరించారు. అనంతరం వారు చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ...


ఖాదర్ ఖాన్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని వారు పేర్కొన్నారు. పోలీసు అధికారులను సస్పెన్స్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఖాదర్ ఖాన్ కుటుంబ సభ్యులను కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

 హజ్రత్ సోఫీ ఆజం కుతుబ్-ఎ-దక్కన్ (రహమతుల్లా హి)...

జూలూస్-ఇ-సందల్ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురాణపుల్ లోని హజ్రత్ సోఫీ ఆజం కుతుబ్-ఎ-దక్కన్(రహమతుల్లా హి) జూలూస్-ఇ-సందల్ షరీఫ్ కార్యక్రమంలో డివిజన్ ఏఐఎంఐఎం కార్పొరేటర్ సున్నం రాజమోహన్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సున్నం రాజ మోహన్ కు సిరాజ్-ఉస్-సోఫియా హజ్రత్ మౌలానా సయ్యద్ షా జహీర్ ఉద్దీన్ అలీ సోఫీ క్వాద్రీ (సజాదా నాషి దర్గా హజ్రత్ సోఫీ ఆజం ) పూలమాలవేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పురాణా పూల్ ఎంఎం నాయకులు కే శ్రీనివాస్, అంజద్ ఖాద్రి మసూది తదితరులు పాల్గొన్నారు.


 రాష్ట్ర గవర్నర్  పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన... 

జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి రఘువీర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సందర్శించుకోవడానికి వస్తున్న సందర్భంగా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్‌పి కె. రఘువీర్ రెడ్డిలు ఆదివారం పర్యవేక్షించారు. సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని పరిశీలిస్తూ ప్రోటోకాల్ ప్రకారం హెలిప్యాడ్ ఏర్పాట్లు, చుట్టూ బ్యారికేడింగ్,  తాత్కాలిక శౌచాలయాల ప్రదేశాలను పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  సున్నిపెంట్ హెలిప్యాడ్ మైదానం నుండి మాక్ ట్రయల్ రన్  నిర్వహిస్తూ మార్గమధ్యములో పారిశుద్ద్య చర్యలు,ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు,


సలహాలు జారీ చేశారు. అనంతరం భ్రమరాంబా అతిథిగృహం నుండి ప్రధానాలయగోపురం ఎదురుగా గల గంగాధర మండపం వద్దకు చేరుకుంటారని అక్కడినుండి శ్రీకృష్ణ దేవరాయగోపురం వద్ద రాష్ట్ర గవర్నరుకు ఆలయ సంప్రదాయాలతో అర్చకులు పూర్ణకుంభం తో ఆలయంలోకి స్వాగతం పలికి శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి జరిపే ప్రత్యేక పూజా కార్యక్రమాలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారితో చర్చించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, గవర్నర్ ప్రోటోకాల్ అధికారి ఉదయరాజు,దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న,ఆత్మకూరు ఆర్డిఓ దాసు,జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్ డిఏ పీడి శ్రీధరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 రంగ రంగ వైభవంగా...

 శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామ సమీపంలోని ఎర్రమల కొండలలో వెలిసి దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంగళ వాయిద్యాల,వేద మంత్రోచ్ఛరణల మధ్య భోగేశ్వర స్వామి వారి తరుపున సునీల్ కుమార్ రెడ్డి,నాగలక్ష్మి దంపతులు, దుర్గామాత తరపున గణేష్ రెడ్డి, లక్ష్మి దంపతులు పెళ్లి పెద్దలుగా కూర్చుని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ రంగ రంగ వైభవంగా నిర్వహించారు. పాణ్యం శాసనసభ సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,


కర్నూలు జిల్లా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ లు స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో దేవస్థాన అధికారులు ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రైతు సంబరాల్లో బండలాగు ఎద్దుల పంధ్యాలను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,గడివేముల జడ్పిటిసి సభ్యులు ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి,

గడిగిరేవుల సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి,ఆలయ ధర్మకర్తలు,సిబ్బంది రమణ,భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు.మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు గడివేముల ఎస్సై బిటి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నంద్యాల, పాణ్యం,గడివేముల పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.



 భగవంతుని సేవలో భక్తులు, భక్తులసేవలో....

గడివేముల రెడ్ క్రాస్ సభ్యులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో వెలిసి దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గడివేముల మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు తహసిల్దార్ శ్రీనివాసులు గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ శనివారము,ఆదివారము, సోమవారము సుదూర ప్రాంతాల నుండి శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని రెడ్ క్రాస్ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నారని,


దర్శించుకోవడానికి వచ్చిన భక్తులలోని వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యంతో దర్శనం కల్పించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని,ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సెక్రెటరీ మమతా రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,గడివేముల రెడ్ క్రాస్ సభ్యులు వివి కృష్ణయ్య, శ్రీధర్ బాబు,లింగమయ్య, సుబ్బరాయుడు, వేణుగోపాల్,రాజు మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.


 యాగంటి ఉమామహేశ్వర స్వామికి టీటీడీ పట్టువస్త్రాలు  సమర్పించిన...

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని దంపతులు

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని యాగంటి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా టిటిడి పాలక మండలి సభ్యులు,పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి యాగంటి  ఉమామహేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.యాగంటి దేవస్థానం చరిత్రలో  టిటిడి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

వివరాలలోకి వెళితే తిరుమల తిరుపతి దేవస్థాన జెఈఓ వీర బ్రహ్మం గారు పట్టువస్త్రాలను యాగంటి క్షేత్రానికి తీసుకొని రాగా టీటీడీ పాలక మండలి సభ్యులు మరియు పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు మరియు పాలక మండలి సభ్యులు మారుతీ ప్రసాద్ దంపతులు మేళతాళాలతో ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గర్భగుడిలో స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాగంటి పుణ్యక్షేత్రానికి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో యాగంటి దేవస్థానం ఆలయ నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి,శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, ట్రెజరర్ రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 "శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి" సందర్భంగా

శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అన్యాయానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడి తన మతాన్ని, సంస్కృతిని కాపాడిన హిందూ హృదయ సామ్రాట్ "శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి" సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అల్లికోల్ తండా గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని  ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘన నివాళ్లలర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిజాం వారసుల ఎంఐఎం అడుగు పెట్టనిచ్చే అవకాశమే లేకుండా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటుతూ హిందువులనంత ఏకం చేేసే దిశగా బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అడుగులేస్తున్నారు.

 ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమ్ రాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్, జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, అల్లికోల్ తండా సర్పంచ్ రేణుక రాజ్ నాయక్, నర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, ముచ్చింతల్ సర్పంచ్ చంద్రయ్య, ఎంపీటీసీ తొంటా గౌతమీఅశోక్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, బిజెపి శంషాబాద్ నేతలు పాల్గొన్నారు. 


 




 



 




 పాణ్యం దళితుల కాలనీలో దళితులు ను పట్టించుకోరా అభివృద్ధి చేయరా...? 

సమస్యలను పాణ్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యులు వనం వెంకటాద్రి, దళిత కాలనీ ప్రజలు ఏఐఎఫ్బి, ఆర్విఎఫ్,  ప్రజా సంఘాల నాయకులు

నంది విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యంలో రాజుల కాలంలో బృంగేశ్వరా స్వామి దేవాలయం లో నందీశ్వర విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిగా పని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై నంది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద పండితులు వేదమంత్రాల తో ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు వనం వెంకటాద్రి,ఆర్వీఎఫ్ జిల్లా అధ్యక్షులు బత్తిన ప్రతాప్, దళిత కాలనీవాసులు కలిసి మాట్లాడుతూ గుడి పక్కలో దాదాపుగా యాభై సెంట్లు స్థలం ను


రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ కళ్యాణ మండపంను దళితుల కోసం ఏర్పాటు చేయాలని, దళిత కాలనీవాసులు చందాలు పోగుచేసుకుని అస్తవ్యస్తంగా ఉన్న స్థలమును శుభ్రపరచుకున్నారని, శుభ్రపరచుకున్న స్థలంను  దళితులకు ఇవ్వకుండా స్థలాన్ని దేవస్థానానికి ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పి మాట తప్పడం చాలా బాధాకరమైన విషయని,దళితుల కాలనీలో గెలిచిన తర్వాత నాయకులు మహిళలకు మరుగుదొడ్లు,నీటి వసతి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత 30 సంవత్సరాల నుండి  ఉచిత హామీలను నాయకులు ఇస్తూ ఎస్సీ కాలనీ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నా రని, నాయకులు గెలిచిన తర్వాత దళితుల కాలనీలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి శూన్యమని,ఇచ్చిన హామీలను నెరవేర్చి, అభివృద్ధి చేసి దళితుల కాలనీలో వైయస్ఆర్సీపీ నాయకులు ఎస్సీ కాలనీలో
దళిత కాలనీని అభివృద్ధి చేయాలనిఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ప్రజాసంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు, దళిత కాలనీ ప్రజలు.

అడుగుపెట్టాలని హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజులలో వైస్సార్ పార్టీ నాయకులను ఎస్సీ కాలనిలోకి రానీయబొమని,ఆస్థలంను వెంటనే ఎస్సీ కాలనీ ప్రజలకు రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ కళ్యాణం మండపం ఏర్పాటు చేసి ఎస్సీ కాలాని ప్రజలకు ఇవ్వాలని కోరిన వనము వెంకటాద్రి,ఆర్విఎఫ్ నాయకులు బత్తిన ప్రతాప్,వనము నాగరాజు,  మల్లిపొగు సుబ్బన్న,  నెరవాటి సుబ్బారాయుడు, చిలకలబాలన్న తదీతరులు పాల్గొన్నారు.

 సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన..

గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామ సచివాలయమును గడివేముల మండలం అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా చిందుకూరు గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ తో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్ గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అందరు తప్పకుండా వారంలో 3 రోజులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలని,సచివాలయ సిబ్బంది అందరు తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం తప్పక బయో మెట్రిక్ హాజరు వెయ్యాలని, సచివాలయ కార్యాలయాల్లో మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంకాలం 05:00 గంటల వరకు స్పందన కార్యక్రమము తప్పనిసరిగా నిర్వహించాలని, సచివాలయ సిబ్బంది స్పందన కార్యక్రమానికి హాజరు కాని వారి వివరాలను జిల్లా కలెక్టర్ గారికి పంపబడుతుందని,  ప్రతి సచివాలయంలో ప్రతిరోజు 10 సేవలు  తగ్గకుండా చూసుకోవాలనీ, సచివాలయంలో ఉన్న సేవల గురించి ప్రజలందరికి తెలియజేసి సేవలను ప్రజలు వినియోగించుకోనే విధంగా ప్రజలను ప్రేరేపించాలని,


సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ అందరు మంచి అవగాహన,సఖ్యతతో  ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని,గ్రామాల అభివృద్ధి కొరకు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలను రూపొందించుకొని అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధి చేయడంలో గడివేముల మండలము వెనుకబడి ఉందని, PMJAY  అయుష్మాన్ భారత్ భీమాను త్వరగా పూర్తి చెయ్యాలని గడివేముల ఎంపిడిఓ విజయసింహరెడ్డి ఆదేశించారు.

 భారీ వాహనాలకు ప్రవేశం లేదు

ఆత్మకూరు ఎస్సై హుస్సేన్ బాషా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో జరుగుచున్న శ్రీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహా శివరాత్రి  బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిద రాష్ట్రాల మరియు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు,భక్తులు మరియు వీఐపీలు,భారీగా దైవదర్శనానికి తరలివస్తున్న కారణంగా 17.02.2023 నుండి 19.02.2023 వరకు దోర్నాల,విజయవాడకు, వెళ్లవలసిన భారీ వాహనాల రాకపోకలకు,  ఎటువంటి అవాంతరాలు లేని వాహనాల రాకపోకల దృష్ట్యా కర్నూలు పట్టణం లోని నంద్యాల చెక్ పోస్ట్ నుండి ఆత్మకూరు - దోర్నాల మీదుగా  విజయవాడకు రాకపోకలు నిలిపివేయడం జరిగింది. 


కావున వాహనదారులు గమనించి లారీలు, భారీ గూడ్స్ వాహనాలు 17.02.2023 నుండి 19.02.2023 వరకు కర్నూలు పట్టణం నుండి దోర్నాల,విజయవాడలకు, వెళ్ళువాహనాలు నంద్యాల చెక్ పోస్ట్ నుండి నంద్యాల, గిద్దలూరు,మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవాలని, అదేవిధముగా ఆత్మకూరు నుండి దోర్నాల, విజయవాడలకు వెళ్ళు  లారీలు,భారీ గూడ్స్ వాహనాలు ఆత్మకూరు నంద్యాల టర్నింగ్ నుండి వెలుగోడు,బండిఆత్మకూర్,నంద్యాలనుండి,గిద్దలూరు,మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకోవలసిందిగా ఆత్మకూరు ఎస్సై హుస్సేన్ భాష గారు తెలిపారు.


 సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా

పెండ్యాల లక్ష్మణ్ రావు అద్వర్యంలో...భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయంలో చార్మినార్ నియోజకవర్గం బి ఆర్ ఎస్   నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ రావు అద్వర్యంలో అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పుస్తె శ్రీకాంత్,                             


 రవిశ్వర్ , మనిషాగర్వాల్, అనూష, గోపి గౌడ్, కే సుదర్శన్, ప్రణయ్ కుమార్, శైలజ, అనురాధ, కే సుదర్శన్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా...

చారిత్రాత్మక లాల్ ధర్వాజ సింహవాహినీ  శ్రీ మహాంకాళీ అమ్మవారికి పట్టు వస్రాల సమర్పణ

ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవాలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ పోసాని సురేందర్ ముదిరాజ్,   బద్రీనాథ్ గౌడ్  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు , ఆలయ సంప్రదాయ ప్రకారం బ్యాండ్ మేళాలతో అమ్మవారికి పట్టు  వస్త్రాలు , పూలు , పండ్లు స్వీట్స్ ఊరేగింపుగా  తీసుకోని  వచ్చారు. అమ్మ వారికీ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భముగా పట్టు వస్త్రాలు సమర్పించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.



కెసిఆర్ అమ్మవారి  కృప  కటాక్షాల  ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో  నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని అమ్మవారిని కోరడం జరిగింది. పూజా అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాషేఖం చేసి ప్రజలకు మిఠాయిలు పంచిపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణా రాష్ట్రం సాధించిన సందర్భంగా 2014 వ సంవత్సరంలో కెసిఆర్ సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారికి బంగారుబోనం సమర్పించి అమ్మవారి ఆలయ విస్తరణకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీమేరకు 2023  ఫిబ్రవరిలో బట్జెట్ సమావేశాల సంధర్భముగా అసెంబ్లీ లో అమ్మవారి ఆలయ విస్తరణ గురించి చర్చించడం జరిగిందనీ,


కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు 2023 సంవత్సరం ఆశాడమాస బొనాలకంటే ముందుగా ఆలయవిస్థరణ చేపట్టాలని ముఖ్యమంత్రికి    రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోరిక అని వారు పేర్కొన్నారు. ఈ పూజ  కార్యక్రమంలో ఆలయ ఫోర్ మెన్ కమిటీ చైర్మన్ లు పోసాని సురేందర్ ముదిరాజ్, బద్రీనాథ్ గౌడ్ ,  సి శివ కుమార్ యాదవ్, ఎస్ రాజ్ కుమార్ , ఆలయ ప్రతినిధులు  కాశి నాథ్గ గౌడ్ , పోసాని సదానంద్ , ప్రభు, బి ర్ స్ నాయకులు తిరుపతి నాగరాజ్, విష్ణు గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్,    శేఖర్ , ప్రభు గౌడ్, రంగ హరి గౌడ్, అభినాష్ తదితరులు పాల్గొన్నారు .