శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో,,

ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభం

వేలంపాట నిర్వహించిన..,. ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడిగరేవుల గ్రామంలో వెలిసి దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా శివ స్వాములకు 02-02-2023 తేదీ వరకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు రవి కిరణ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలింగరపండ్లు, చెరుకు, కూల్ డ్రింక్స్, సప్లయర్స్, డెకరేషన్ అమ్ముకును వారికి వేలంపాటలు నిర్వహించారు.


2022 సంవత్సరంలో 1,40,800 రూపాయలకు లబ్ధిదారులు వేలంపాట పాడారని,2023 సంవత్సరంలో 2,07,000 రూపాయలకు లబ్ధిదారులు వేలం పాట పాడారని, 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో 66,200 రూపాయల ఆదాయం ఆలయానికి వచ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణ అధికారి రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ,గిరిధర్ శర్మ, ఆలయ సిబ్బంది రమణ, వేలంపాట లబ్ధిదారులు, గడిగరేవుల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: