ఐదు రూపాయల బిల్లలు తీసుకోం

గడివేముల విద్యుత్ శాఖ బిల్ కలెక్టర్ సుబ్బారావు వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో విద్యుత్ కరెంట్ బిల్లులు కట్టడానికి వచ్చిన వినియోగదారులతో విద్యుత్ శాఖ బిల్ కలెక్టర్ సుబ్బారావు ఐదు రూపాయలు బిల్లులు తీసుకోము, బ్యాంకులో కట్టించుకోరని వెనక్కి పంపిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ బిల్ కలెక్టర్ తో ఐదు రూపాయల బిల్లలు బ్యాంకు లోనే తయారయ్యాయి కదా, మా దగ్గర ఇవే ఉన్నాయి, ఎందుకు కట్టించుకోరు అని  ఐదు రూపాయల బిల్లలు చెల్లవా అని విద్యుత్ బిల్లులు కట్టడానికి వచ్చిన విద్యుత్ వినియోగదారులు ప్రశ్నించగాj,

విద్యుత్ శాఖ బిల్ కలెక్టర్ సుబ్బారావు తన సెల్ తో వీడియో, ఫోటోలు తీసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, బ్యాంకు వారు చిల్లర డబ్బులు తీసుకోవడం లేదని దురుసుగా, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ విద్యుత్ బిల్లులు కట్టడానికి వచ్చిన వినియోగదారులను వెనక్కి పంపుతున్నారని, విద్యుత్ బిల్లులను సకాలంలో ఏ విధంగా చెల్లించాలని బిలకల గూడూరు గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: