స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా సోమేశ్ కుమార్ఆలోచన
తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు వెళ్లాలంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నెల 12 లోపు ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో సమావేశంలోనూ ఇదే అంశాన్ని వెల్లడించినట్టు సమాచారం.
సోమేశ్ కుమార్ ఈ ఏడాది డిసెంబరుతో పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్ఎస్ తీసుకోవడంపై ఆలోచన చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు, తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలను కూడా తోసిపుచ్చలేం. అటు, కేసీఆర్ తో సాన్నిహిత్యం దృష్ట్యా... వీఆర్ఎస్ అనంతరం సోమేశ్ కుమార్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
Home
Unlabelled
స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా సోమేశ్ కుమార్ఆలోచన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: